ETV Bharat / bharat

ట్విట్టర్​కు మరిన్ని చిక్కులు- యూపీలో​ కేసు - వీడియో వైరల్​

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దాడి ఘటనకు సంబంధించి ట్విట్టర్​, ఓ న్యూస్​ వెబ్​సైట్​ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు ఘజియాబాద్​ పోలీసులు. ఆరుగురిని అరెస్ట్​ చేశారు. ఆ వీడియోలో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు.

UP Police books Twitter
ట్విట్టర్​పై కేసు
author img

By

Published : Jun 16, 2021, 12:00 PM IST

Updated : Jun 16, 2021, 12:16 PM IST

ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్​కు చెందిన ఓ ముస్లిం వృద్ధుడిపై దుండగులు దాడి చేసిన ఘటనపై రాజకీయ దుమారం చెలరేగిన క్రమంలో చర్యలు చేపట్టారు ఆ రాష్ట్ర పోలీసులు. తనపై దాడి చేసినట్లు వృద్ధుడు పేర్కొన్న వీడియో వైరల్​గా మారిన నేపథ్యంలో.. ట్విట్టర్​, ఓ న్యూస్​ పోర్టల్​ సహా ఆరుగురిపై కేసు నమోదు చేశారు.

మతపరమైన ఘర్షణలు సృష్టించాలనే ఉద్దేశంతో వీడియోను షేర్​ చేశారని స్థానిక పోలీసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘజియాబాద్​లోని.. లోనీ బార్డర్​ పోలీస్​ స్టేషన్​లో మంగళవారం రాత్రి 11.30 గంటలకు కేసు నమోదైంది.

ఆరుగురు అరెస్ట్​..

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్​ చేశారు ఘజియాబాద్​ పోలీసులు. అందులో ముస్లింలు సైతం ఉన్నారు. ఇందులో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు. ట్విట్టర్​ ఐఎన్​సీ, ట్విట్టర్​ కమ్యూనికేషన్స్​ ఇండియా, న్యూస్​ వెబ్​సైట్​ వైర్​, జర్నలిస్టులు మహమ్మద్​ జుబెయిర్​, రాణా అయుబ్​, కాంగ్రెస్​ నేతలు సల్మాన్​ నిజామి, మస్కూర్​ ఉస్మాని, డాక్టర్​ సామ మహమ్మద్​, రచయిత సబా నఖ్వీపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

" మతపరమైన కోణం ఉందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతో.. నిజానిజాలు తెలుసుకోకుండా ఆ వీడియోను ఆన్​లైన్​లో షేర్​ చేశారు. మరోవైపు.. ఈ అంశంపై ట్విట్టర్​ కమ్యూనికేషన్స్​ ఇండియా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఐపీసీ సెక్షన్​ 153, 153ఏ, 295ఏ, 120బీ ప్రకారం కేసు నమోదైంది "

- అమిత్​ పాఠక్​, సీనియర్​ ఎస్పీ, ఘజియాబాద్​.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారిన ఈ వీడియోలో.. అబ్దుల్​ షమద్​ సైఫీ అనే వృద్ధుడు.. కొందరు తనపై దాడి చేశారని, జై శ్రీరాం అనాలని సూచించారని పేర్కొన్నాడు.

ఇదీ చూడండి: UP: 'వృద్ధుడిపై దాడి' ఘటనపై రాజకీయ దుమారం

Last Updated : Jun 16, 2021, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.