ETV Bharat / bharat

యూపీలో 'లవ్​ జిహాద్​' మొదటి అరెస్టు

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ఇటీవలే జారీ చేసిన 'లవ్ జిహాద్' ఆర్డినెన్సుకు సంబంధించి బరేలీ పోలీసులు మొదటి అరెస్టు చేశారు. ఓ వ్యక్తి తనకు పరిచయం ఉన్న మహిళనే మత మార్పిడి చేసేందుకు యత్నించాడని తెలిపారు. ప్రస్తుతం నిందితుడు జుడిషియల్​ కస్టడీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

love jihad
యూపీలో 'లవ్​ జిహాద్​' మొదటి అరెస్టు
author img

By

Published : Dec 3, 2020, 4:00 PM IST

'లవ్​ జిహాద్' ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చాక ఉత్తర్​ప్రదేశ్​ బరేలీ పోలీసులు మొదటి అరెస్టు చేశారు. మొదటి కేసు నమోదైన మూడు రోజుల అనంతరం పోలీసులకు చిక్కాడు నిందితుడు.

తప్పించుకు తిరిగి...

20 ఏళ్ల వివాహిత మహిళను కిడ్నాప్ చేసి మతమార్పిడి చేసేందుకు యత్నించిన ఉవైష్ అహ్మద్(22)ను బరేలీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు దేవరానియా ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించారు. పోలీసులు ఎన్​కౌంటర్​ చేస్తారనే భయంతో నిందితుడు తప్పించుకు తిరిగినట్లు విచారణలో తెలిపాడు.

" నిందితుడికి హాని తలపెట్టాలని పోలీసులు ఆలోచించలేదు. అతడ్ని అరెస్టు చేయడానికి మాత్రమే ప్రయత్నించారు. ఉవైష్ బుధవారం పట్టుబడ్డ తర్వాత మెజిస్ట్రేట్​ ముందు హాజరుపరిచాం. ప్రస్తుతం అతడ్ని 14 రోజుల జుడిషియల్​ కస్టడీకి తరలించారు".

-సన్సార్ సింగ్, అదనపు ఎస్పీ.

ఇదీ చదవండి:ఉత్తర్​ప్రదేశ్​లో తొలి 'లవ్​ జిహాద్' కేసు'

లవ్​ జిహాద్​'పై యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్​

గతంలోనూ కేసు నమోదు

మొదట్లో ఉవైష్​ను వివాహమాడిన బాధితురాలు కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అతడ్ని వదిలేసింది. అయినా నిందితుడు​ తనను వేధిస్తున్నాడని బాధితురాలి తండ్రి ఉవైష్​పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మత మార్పిడికి పాల్పడ్డాడనీ నిందితుడిపై కేసు నమోదు కావడం వల్ల పోలీసులు ఉవైష్​ను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:గుజరాత్ హైకోర్ట్ మాస్క్​ రూల్స్​పై సుప్రీం స్టే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.