ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. మరోసారి లాక్డౌన్ అస్త్రాన్ని ఎంచుకుంది యోగి సర్కార్. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ఐదు నగరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు తెలిపింది. సోమవారం రాత్రి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
రాష్ట్ర రాజధాని లఖ్‌నవూ సహా.. వారణాసి, కాన్పుర్, గోరఖ్‌పుర్, ప్రయాగ్‌రాజ్‌లలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల లాక్‌డౌన్‌ను విధించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
ఇదీ చదవండి: దిల్లీలో లాక్డౌన్- లిక్కర్ షాపుల ముందు భారీ క్యూ