ETV Bharat / bharat

'భుట్టో తల తెస్తే రూ.2కోట్లు'.. భాజపా నేత ప్రకటన.. పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం - మోదీపై బిలావల్‌ భుట్టో జర్దారీ కామెంట్స్

పాక్ విదేశాంగ మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భాజపా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. కాగా, యూపీకి చెందిన ఓ భాజపా నేత.. 'భుట్టో తల తీసుకొస్తే రూ.2కోట్లు ఇస్తా'నని ప్రకటించారు.

Bilawal Bhutto pakistan
Bilawal Bhutto
author img

By

Published : Dec 17, 2022, 8:15 PM IST

Updated : Dec 17, 2022, 10:55 PM IST

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టోపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో 'భుట్టో తల తీసుకొస్తే రూ.2కోట్ల రివార్డు ఇస్తా'నని ఉత్తర్​ప్రదేశ్ భాజపా నేత మనుపాల్ భన్సల్ ప్రకటించారు. బాగ్​పత్​లోని జిల్లా పంచాయత్​కు చెందిన మనుపాల్.. భుట్టో వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలో ఈ ప్రకటన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లు స్పష్టం చేశారు.

'మోదీ కోసం ఏదైనా చేస్తాం'
"అవును నేను ఆ వ్యాఖ్యలు చేశాను. మనం ఎంతో గౌరవించే ప్రధాని మోదీ గురించి వారు అలాంటి మాటలు మాట్లాడుతుంటే మేం సహించం. ప్రధాని అంటే మాకు చాలా గౌరవం ఉంది. ఆయన కోసం ఎలాంటి పనైనా చేస్తాం" అని మనుపాల్ భన్సల్ వ్యాఖ్యానించారు.

'భుట్టో తల తెస్తే రూ.2కోట్లు'.. భాజపా నేత ప్రకటన.. పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం

మరోవైపు, బిలావల్ భుట్టో వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కోల్‌కతా, రాంచీ, పుణె, దిల్లీ, గోరఖ్​పుర్‌లో ఆ పార్టీ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తించారు. పుణెలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... దాయాది దేశం జాతీయ జెండాలను దహనం చేశారు. ఈ ఆందోళనల్లో పలువురు భాజపా ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీని కించపరచే వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ కమలం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. బిలావల్‌ దిష్టిబొమ్మను దహనం చేసి పాకిస్థాన్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు.

Last Updated : Dec 17, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.