ETV Bharat / bharat

బాలికపై గ్యాంగ్​ రేప్.. మూడు రోజుల తర్వాత.. రూ.75 కోసం! - delhi physically handicapped sexual assault

15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ అమానవీయ ఘటన దిల్లీలో వెలుగుచూసింది.

up agra gang rape
up agra gang rape
author img

By

Published : Mar 10, 2023, 10:57 PM IST

ఉత్తర్​ప్రదేశ్​.. ఆగ్రాలో దారుణం జరిగింది. బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హోలీ రోజు కనిపించకుండా పోయిన 15 ఏళ్ల బాలిక ఆచూకీ తెలిసిందని పోలీసులు తెలిపారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
హోలీ ఆడటం కోసం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు బాలిక బయటకు వెళ్లింది. కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు రాత్రంతా వెతికారు. అయినా ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. బాధితురాలిని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అడవిలోనే వదిలేశారు. బాధితురాలు శుక్రవారం ఉయదం పాలు అమ్మే వ్యక్తికి కనిపించింది. ఆ బాలికను గుర్తుపట్టి.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు ఆ వ్యక్తి.

'గుర్తుతెలియని వ్యక్తులు నా కుమార్తెను వాహనంలో అపహరించుకుపోయారు. అనంతరం ఆమెను అడవిలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను గొంతునులిమారు. మరణించిందని భావించి అక్కడి నుంచి పరారయ్యారు.' అని బాధితురాలు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దివ్యాంగురాలిపై లైంగిక దాడి..
22 ఏళ్ల మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఈ దారుణం దిల్లీలోని జాఫ్రాబాద్​లో జరిగింది. నిందితుడు.. బాధితురాలి అపార్ట్​మెంట్​లోనే నివసిస్తున్నాడు. బాధితురాలు తనకు ఇవ్వాల్సిన రూ.75 ఇవ్వాలని నిందితుడిని కోరింది. దీంతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు తనపై జరిగిన లైంగిక దాడి గురించి తన కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

వృద్ధురాలిని ఈడ్చుకెళ్లిన కారు..
హరియాణాలో దారుణం జరిగింది. అంబాలా-చండీగఢ్ హైవేపై వెళ్తున్న ఓ వృద్ధురాలిని కారుతో ఢీకొట్టి 50 మీటర్లు ఈడ్చుకెళ్లాడు ఓ వ్యక్తి. దీంతో వృద్ధురాలు అక్కడికక్కడే మరణించింది. మృతురాలిని లక్ష్మీదేవీ(63)గా పోలీసులు గుర్తించారు. బల్దేవ్ నగర్ చౌక్ సమీపంలో శుక్రవారం జరిగిందీ ఘటన. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
లక్ష్మీదేవీ అనే వృద్ధురాలిని కారు ఢీకొట్టింది. ఆమె చీర వాహనంలో ఇరుక్కుపోయింది. దీంతో కారు డ్రైవర్ ఆపకుండా 50 మీటర్లు లాక్కెళ్లిపోయాడు. లక్షీదేవి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనాస్థలిలో ప్రజలు భారీగా గుమిగూడారు. నిందితుడు వాహనాన్ని వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. కారును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.