ETV Bharat / bharat

తొమ్మిదేళ్ల వయసులోనే 'చిత్రలేఖనం'లో అద్భుతాలు

తొమ్మిదేళ్ల వయసు పిల్లలు స్నేహితులతో గడిపేందుకే ఇష్టపడతారు. కానీ, ఒడిశాకు చెందిన సోను ఇందుకు భిన్నం. లాక్​డౌన్​ సమయాన్ని సద్వినియోగం చేసుకొని తనలోని ప్రతిభను చూపుతున్నాడు. పెన్సిల్​తో ప్రముఖుల చిత్రాలు అచ్చంగా దింపేస్తూ అబ్బురపరుస్తున్నాడు. అంతేకాదండోయ్​.. ఇంకా చాలా కళలు ఉన్నాయి ఆ చిన్నారిలో.. అవేంటో తెలుసుకుందాం.

Unique artistic drawing
చిత్రలేఖనంలో సోను అద్భుతాలు
author img

By

Published : Apr 27, 2021, 7:23 AM IST

చిత్రలేఖనంలో సోను అద్భుతాలు

తోటి పిల్లలతో కలిసి ఆటపాటల్లో మునిగితేలాల్సిన వయసులో.. ఏదో కొత్తగా చేయాలనే తపన. తన కోరికను కరోనాతో విధించిన లాక్​డౌన్​ తీర్చింది. తనలోని కళతో.. దేశంలోని ప్రముఖుల చిత్రపటాలను పెన్సిల్​తో అచ్చుగుద్దినట్లు గీస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. అతనే ఒడిశాకు చెందిన తొమ్మిదేళ్ల సోను.

Unique artistic drawing
సీఎం పట్నాయక్​ చిత్రం గీస్తున్న సోను

ఒడిశా కటక్​లోని కందర్​పుర్​ ప్రాంతానికి చెందిన బిభు ప్రసాద్​ స్వేయిన్​, ఇతిశ్రీ మోహపాత్రల కుమారుడు సోను. తనలోని మేధాశక్తితో ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. తనకు దొరికిన ఖాళీ సమయంలో స్నేహితులతో ఆటలాడకుండా.. చిత్రలేఖనంలో మునిగితేలుతాడు. చిన్నతనంలోనే కుమారుడిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు ఆ దిశగా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఎందరో ప్రముఖల చిత్రాలను అందంగా, అచ్చంగా గీస్తున్న కొడుకును చూసి మురిసిపోతున్నారు.

ఈ చిన్నారి గీసిన చిత్రాల్లో.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​, ఈనాడు గ్రూప్​ సంస్థల ఛైర్మన్​ రామోజీరావు వంటి ప్రముఖులు ఉన్నారు.

Unique artistic drawing
ఈనాడు సంస్థల ఛైర్మన్​ రామోజీ రావు చిత్రపటం
Unique artistic drawing
రాష్ట్రపతి కోవింద్​, ప్రధాని మోదీ చిత్రపటాలు

ప్రకృతి ప్రేమికుడు..

పెయింటింగ్​పై ఆసక్తితో ఇంటర్​నెట్​ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు సోను. డ్రాయింగ్​ మాత్రమే కాదు. సోనూకు ప్రకృతిపై కూడా ప్రేమ ఎక్కువే. తన ఇంటిలోని గార్డెన్​ను చూసుకోవటం, పెంపుడు జంతువులతో ఆడుకోవటం అంటే ఇష్టపడతాడు. అలాగే.. వంట కూడా ఎంతో రుచికరంగా చేస్తాడు. భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్​ కావాలనేదే తన కళగా చెబుతున్నాడు సోను.

ఇదీ చూడండి: ఉచిత ఆక్సిజన్​తో 5,500 మందిని కాపాడిన యువకుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.