ETV Bharat / bharat

సార్వత్రిక సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు - All India strike latest news

అఖిల భారత సమ్మెకు గురువారం పిలుపునిచ్చాయి కేంద్ర కార్మిక సంఘాలు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ బంద్​ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశాయి. అయితే ఈ సమ్మెలో 25కోట్ల మంది పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది.

Unions expect about 25 cr workers to participate in nationwide strike on Nov 26
దేశవ్యాప్త బందులో 25 కోట్ల మంది కార్మికులు!
author img

By

Published : Nov 25, 2020, 11:24 AM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు గురువారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో 25 కోట్ల మంది పాల్గొనే అవకాశం ఉందని అంచనా. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, టీయూసీసీ, హెచ్​ఎంఎస్​, ఏఐయూటీయూసీ, ఎస్​ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్​పీఎఫ్​, యూటీయూసీ బంద్​లో పాల్గొనేందుకు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో బంద్​కు సిద్ధమవుతున్నారు నాయకులు.

ఈ బంద్​లో భాగంగా నూతన వ్యవసాయ చట్టాలకు నిరసనగా 26, 27 తేదీల్లో 'చలో పార్లమెంట్​' మార్చ్​ను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కార్మికులందరూ మద్దతివ్వాలని పిలుపునిచ్చారు ఆయా సంఘాల నేతలు.

అయితే భాజపా కూటమికి చెందిన భారతీయ మజ్దూర్​ సంఘ్​(బీఎంఎస్​), దాని అనుబంధ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనబోవని స్పష్టం చేశాయి. ఈ సమ్మె రాజకీయ ప్రేరిపితమైందని ఆరోపించాయి.

రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, ఆర్థిక రంగంతో సహా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, రైల్వే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఓడరేవులు వంటి ప్రభుత్వ నిర్వహణ, సేవా సంస్థల కార్పొరేటైజేషన్‌ వంటి వాటికి నిరసనగా ఈ బంద్​కు పిలుపునిచ్చారు.

ఇదీ చూడండి: ఇప్పట్లో కాంగ్రెస్​కు కొత్త సారథి లేనట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.