భారత్‌లోనే ఎత్తైన వాతావరణ కేంద్రాన్ని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని లేహ్‌లో సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తులో దీనిని ఏర్పాటు చేశారు. రహదారులు, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బందిపై ట్రాఫిక్ కదలికల కోసం భారత వాతారణశాఖ (ఐఎండీ) ప్రత్యేక వాతావరణ సూచనలు అందించనుంది. దీంతో హిమాలయాల్లో రెండో వాతావరణ కేంద్రాన్ని భారత్ ఏర్పాటు చేసినట్లైంది.
ఇటీవల అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్‌లోనూ ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని ఐఎండీ అందుబాటులోకి తెచ్చింది. ‘లద్దాఖ్‌లో వాతావరణం తరచూ మారుతుంటుంది. ఇది స్థానికులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అలాగే దేశ భద్రత, భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశాం’ అని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కాగా.. భారత్ ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గం (అటల్ టన్నెల్)ను నిర్మించింది. మనాలి నుంచి లేహ్ వరకు 9.2 కి.మీ ఉన్న ఈ సొరంగ మార్గం.. సముద్రమట్టానికి 10వేల అడుగుల ఎత్తులో ఉంది.
ఇదీ చూడండి: ప్రత్యేక ఆకర్షణలకు నెలవు ఈ 'వేడినీటి గుండాలు'