Amit shah: జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి తీరుతాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోందని.. అది పూర్తయ్యాక ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించనున్నట్లు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా జమ్ముకశ్మీర్ జిల్లా సుపరిపాలన సూచికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమిత్ షా విడుదల చేశారు.
జమ్ముకశ్మీర్‌పై ప్రధాని మోదీకి ప్రత్యేక దృష్టి ఉందన్నారు షా. అన్నిరకాలుగా అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కొందరు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారి ఉచ్చులో కశ్మీరీ ప్రజలు పడొద్దని సూచించారు. ఇప్పటికే జమ్ముకశ్మీర్‌కు రూ.12వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, పర్యటకుల రాకతో అవి మరింత పెరుగుతాయని చెప్పారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: UP polls 2022: భాజపా ఇంటింటి ప్రచారంలో షా.. ఎస్పీపై యోగి విమర్శలు