కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా దేశంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి ఆదివారానికి ఏడాది పూర్తవుతోంది. 2021, జనవరి 16న ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది కేంద్రం. ఇప్పటి వరకు 156 కోట్ల డోసులు ( 90 కోట్ల మందికిపైగా తొలి డోసు, 65 కోట్ల మందికిపైగా రెండు డోసులు, 42 లక్షల మందికిపైగా ప్రికాషనరీ డోసులు) అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది భారత్.
ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీకా పంపిణీగా పేర్కొన్నారు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా. ట్వీట్టర్ వేదికగా టీకా ప్రారంభమైన నాటి నుంచి సాధించిన కీలక మైలురాళ్లను వెల్లడించారు.
" భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్.. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన ప్రక్రియ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ స్ఫూర్తిమంతమైన, ముందుచూపు గల నాయకత్వంలో కరోనాపై దేశ సమ్మిళిత పోరాట గొప్పతనాన్ని ఏడాదిగా సాగుతున్న టీకా పంపిణీ స్పష్టం చేస్తుంది."
- మాన్సుఖ్ మాండవీయా, కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ.
భారత్ టీకా పంపిణీలో కీలక మైలురాళ్లు..
ఇదీ చూడండి: One Year For Vaccination: దేశంలో టీకా ప్రక్రియ మొదలై నేటికి ఏడాది..
వ్యాక్సినేషన్‌లో దూసుకెళ్తున్న దేశాలు.. భారత్ ఎన్నో స్థానమంటే?