ETV Bharat / bharat

నిర్మాణంలో ఉన్న గోదాము కూలి ఐదుగురు మృతి - godown collaped

wall collapse
నిర్మాణంలో ఉన్న గోదాము కూలి పలువురు మృతి
author img

By

Published : Jul 15, 2022, 2:52 PM IST

Updated : Jul 15, 2022, 5:02 PM IST

14:48 July 15

నిర్మాణంలో ఉన్న గోదాము కూలి ఐదుగురు మృతి

నిర్మాణంలో ఉన్న గోదాముకు ప్రమాదం.. పలువురు మృతి

Godown Collapsed: దిల్లీలోని అలీపుర్​లో విషాదం నెలకొంది. నిర్మాణంలో ఉన్న ఓ గోదాము కూలిపోయింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శిథిలాల కింద మరికొంత మంది కూలీలు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు పోలీసులు, అగ్నిమాపక​ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 20-25 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆ గోదామును అక్రమంగా నిర్మిస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికే లిఖితపూర్వంగా ఫిర్యాదు చేసినా నిర్మాణ పనులు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి: Viral Video: సుడిగాలి బీభత్సం.. వణికిపోయిన ఊరి జనం

పెళ్లి కోసం సాహసం.. థర్మకోల్​ షీట్​తో వరదలో 7కి.మీ జర్నీ!

Last Updated : Jul 15, 2022, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.