ETV Bharat / bharat

కుప్పకూలిన కల్వర్టు.. స్నానానికి వెళ్లిన నలుగురు చిన్నారులు దుర్మరణం!

Culvert Collapse In Rayagada Odisha : నిర్మాణంలో ఉన్న కల్వర్టు కుప్పకూలి నలుగురు చిన్నారులు సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఒడిశాలోని రాయగడలో జరిగిందీ దుర్ఘటన. మరోవైపు.. రాజస్థాన్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి చెందగా.. ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు.

Culvert Collapse In Rayagada Odisha
Culvert Collapse In Rayagada Odisha
author img

By

Published : Jul 31, 2023, 11:52 AM IST

Updated : Jul 31, 2023, 2:15 PM IST

Culvert Collapse In Rayagada Odisha : ఒడిశాలోని రాయగడలో నిర్మాణంలో ఉన్న ఓ కల్వర్టు కుప్పకూలి నలుగురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. కల్యాణ్​సింగ్​పుర్ పోలీస్​స్టేషన్​​ పరిధిలోని ఉపాసజ గ్రామంలో సోమవారం జరిగిందీ దుర్ఘటన. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. కొందరు కల్వర్టు కింద స్నానం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మరికొందరు కల్వర్టు కింద ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ట్రక్కును ఢీకొట్టిన కారు.. కానిస్టేబుల్ దుర్మరణం
Constable Died In Accident Rajasthan : రాజస్థాన్‌లోని జైపుర్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్​లో మృతి చెందగా.. ఎస్సై గాయపడ్డారు. ఆదివారం రాత్రి జరిగిందీ దుర్ఘటన. మృతురాలిని బబితగా పోలీసులు గుర్తించారు.

అసలేం జరిగిందంటే..
బబిత అనే మహిళా కానిస్టేబుల్ కారులో ఎస్సై సజ్జన్ సింగ్​తో కలిసి తన ఇంటికి ఆదివారం రాత్రి బయటదేరారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు.. ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఇద్దరు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మార్గమధ్యలోనే కానిస్టేబుల్ బబిత మృతి చెందారు. సజ్జన్​ సింగ్​ ప్రస్తుతం తీవ్ర గాయాలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
బబిత మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం సమయంలో కారును ఎస్సై సజ్జన్ సింగ్ నడిపారని చెప్పారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.

కాలువలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి
Car Fell Into Canal In Karnataka : రెండు రోజుల క్రితం కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కాలువలోకి కారు దూసుకెళ్లడం వల్ల ఓ బాలిక సహా నలుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jul 31, 2023, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.