ETV Bharat / bharat

'అల్ట్రాసౌండ్' స్కానింగ్​తో గజరాజుకు కంటి పరీక్ష

గజరాజుకు కంటిచూపును పరీక్షించేందుకు అల్ట్రాసౌండ్​(యూఎస్​జీ) స్కానింగ్​ నిర్వహించారు అధికారులు. కేరళలోని కొల్లాం జిల్లాలో ఈ ఘటన జరిగింది.

Elephant
ఏనుగు, గజరాజు
author img

By

Published : May 9, 2021, 3:36 PM IST

ఏనుగు కంటి పరీక్షకు అరుదైన 'అల్ట్రా​ స్కానింగ్'​

కేరళలో ఓ ఏనుగు దృష్టిని పరీక్షించేందుకు అల్ట్రాసౌండ్​ సోనోగ్రామ్​(యూఎస్​జీ) స్కానింగ్​ చేశారు అధికారులు. ఇటీవల దాని కళ్లు తెల్లబడటం వల్ల.. చూపు కోల్పోయి అనేక సమస్యలను ఎదుర్కుంటుందనే అనుమానంతో ఈ విధమైన పరీక్షలు నిర్వహించారు.

ఎందుకు స్కానింగ్?

కొల్లాం జిల్లా మావెలిక్కరకు చెందిన చిన్నూ.. 45ఏళ్ల ఏనుగును పోషిస్తున్నాడు. దాన్ని ముద్దుగా కన్నన్​ అని పిలుచుకుంటాడతడు. ఇటీవల కన్నన్​ కళ్లు తెల్లగా మారడం వల్ల.. అది కంటిచూపు సమస్యలను ఎదుర్కొంటోందని గ్రహించాడు. ఈ నేపథ్యంలో జిల్లాలోని డాక్టర్​ అరవిందన్​ అనే పశు వైద్యుణ్ని సంప్రదించాడు. కన్నన్​కు అల్ట్రాసౌండ్​ స్కానింగ్​ చేయాలని ఆ వైద్యుడు సలహా ఇచ్చారు.

ఇదీ చదవండి: బోరుబావిలో గున్న ఏనుగు- స్థానికుల సహాయంతో బయటకు

ఎలా చేశారు?

కన్నన్​ను బయట నిల్చోబెట్టి, గదిలోని యంత్రాలతో యూఎస్​జీ స్కానింగ్​ తీశారు. ఈ సమయంలో దాన్ని స్కానింగ్​కు అనుకూలమైన ప్రదేశంలో నిల్చోబెట్టేందుకు వైద్యుడు, యజమాని తీవ్రంగా శ్రమించారు. ఆ తర్వాత దాన్ని నేలపై పడుకోబెట్టి ఇంజక్షన్​ ఇచ్చేందుకూ ఆపసోపాలు పడ్డారు. గజరాజులకు ఇలాంటి పరీక్షలు చేయడం చాలా అరుదని ఆ వైద్యుడు చెప్పారు.

"ఏనుగులకు స్కానింగ్​ చేయడం చాలా అరుదు. పైగా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని. వీటి స్కానింగ్​ చిత్రాలు కూడా మానవులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ దాన్ని విజయవంతంగా నిర్వహించాం."

- డాక్టర్​ అరవిందన్​, పశువైద్యులు

ఏం తేలింది?

కన్నన్​కు స్కానింగ్ నిర్వహించాక వచ్చిన ఫలితాల్లో.. దాని కుడి కంట్లో శుక్లం, ఎడమ నేత్రంలో 'కార్నియల్​ ఒపాసిటీ' ఉన్నట్టు తేలింది. ఈ కార్నియా.. చూపును ప్రభావితం చేస్తుందని అరవిందన్​ తెలిపారు. అయితే.. చిన్నపాటి రాపిడి ద్వారా ఇంజక్షన్​లను ఉపయోగించి దీనికి చికిత్స చేయవచ్చన్నారు. ఒక నెల తర్వాత కుడి కంట్లో ఏర్పడిన శుక్లాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు.

"గజరాజులకు చేసే కంటిశుక్లం తొలగింపు శస్త్రచికిత్స.. మనుషులకు చేసే శస్త్రచికిత్సకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సాధారణంగా మానవుల్లో లెన్స్​ స్థానంలో వేరేవి అమర్చుతారు. ఏనుగులలో మాత్రం.. అనస్థీషియా ప్రక్రియ ద్వారా శుక్లాన్ని తొలగిస్తారు."

- డాక్టర్​ అరవిందన్​, పశువైద్యులు.

ఇదీ చూడండి: కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.