UIDAI Recruitment 2023 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది సర్కార్. 'భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ' (యూఐడీఏఐ)- ఆధార్ సంస్థలో పనిచేయాలని కోరుకునే వారి కోసం ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దిల్లీలోని UIDAI ప్రాంతీయ కార్యాలయంలోని వివిధ పోస్టులకు డిప్యుటేషన్ పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీలు, జీతం వివరాలు ఇలా..
దిల్లీలోని UIDAI ప్రాంతీయ కార్యాలయంలోని 4 పోస్టులకు డిప్యుటేషన్ (ఫారిన్ సర్వీస్ టర్మ్ ప్రాతిపదికన) పద్ధతిలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యోగానికి ఎంపికైన వారు 5 సంవత్సరాల పాటు సేవలు అందించొచ్చు. UIDAI రిక్రూట్‌మెంట్ 2023 ప్రకారం భర్తీ కానున్న ఈ పోస్టులకు.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పే మ్యాట్రిక్స్ లెవల్ 05 నుంచి లెవల్ 11 మధ్య వేతనాన్ని పొందొచ్చు.
గరిష్ఠ వయసు.. ఈ వెబ్సైట్లో అప్లై..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థుల వయసు 56 ఏళ్ల లోపు ఉండాలి. ఆసక్తి ఉన్న వారు UIDAI (uidai.gov.in) వెబ్సైట్లో నిర్దేశించిన ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు భర్తీ..
- అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
- డిప్యూటీ డైరెక్టర్
- అకౌంటెంట్
కావాల్సిన విద్యార్హతలు:
- అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్- చార్టర్డ్ అకౌంటెంట్/ కాస్ట్ అకౌంటెంట్/ ఎంబీఏ. కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్- అడ్మినిస్ట్రేషన్/ లీగల్/ ఎస్టాబ్లిష్‌మెంట్/ హ్యూమన్ రిసోర్సెస్/ ఫైనాన్స్/ అకౌంట్స్/ బడ్జెట్ I విజిలెన్స్/ ప్రొక్యూర్‌మెంట్/ ప్లానింగ్ అండ్ పాలసీ/ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్/ మానిటరింగ్/ ఈగవర్నెన్స్ మొదలైన వాటిలో పని అనుభవం. కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.
- డిప్యూటీ డైరెక్టర్- అడ్మినిస్ట్రేషన్/ లీగల్/ ఎస్టాబ్లిష్‌మెంట్/ హ్యూమన్ రిసోర్సెస్/ ఫైనాన్స్/ అకౌంట్స్/ బడ్జెట్/ విజిలెన్స్/ ప్రొక్యూర్‌మెంట్/ ప్లానింగ్ అండ్ పాలసీ/ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్/ మానిటరింగ్/ ఈగవర్నెన్స్ మొదలైన వాటిలో అనుభవం. కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.
- అకౌంటెంట్- కామర్స్‌లో గ్రాడ్యుయేషన్(డిగ్రీ). కంప్యూటరైజ్డ్ ఆఫీసు వాతావరణంలో పని చేయడానికి ప్రాథమిక నైపుణ్యాలు.
ఈ పోస్టుకు ఇంత జీతం..
UIDAI రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023 ప్రకారం..
- అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ పోస్ట్‌లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-08 ప్రకారం జీతం పొందుతారు.
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్‌లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-06 ప్రకారం జీతం పొందుతారు.
- డిప్యూటీ డైరెక్టర్ పే పోస్ట్‌లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-11 ప్రకారం జీతం పొందుతారు.
- అకౌంటెంట్ పే పోస్ట్‌లో చేరేవారు పే మ్యాట్రిక్స్ లెవెల్-05 ప్రకారం జీతం పొందుతారు.
దరఖాస్తుకు చివరి తేదీ!
UIDAI రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ ప్రకారం పైన తెలిపిన పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2023 జూన్ 12.