ETV Bharat / bharat

జూ పార్కులో రెండు అరుదైన కోతులు అపహరణ.. కంచె కట్​ చేసి.. - అరుదైన కోతులు అపహరణ

Rare Squirrel Monkey Stolen: చెన్నైలోని వాండలూర్ అన్నా జూ పార్క్​లో రెండు అరుదైన స్క్విరెల్​ కోతులను ఎత్తుకెళ్లారు దుండగులు. వీటికి ప్రపంచ మార్కెట్​లో మంచి డిమాండ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

Rare male Squirrel Monkeys
జూ పార్కులో రెండు అరుదైన కోతులు అపహరణ
author img

By

Published : Feb 11, 2022, 5:24 PM IST

Rare Squirrel Monkey Stolen: తమిళనాడు, చెన్నైలోని వాండలూర్ అన్నా జూ పార్క్.. అనేక అరుదైన జాతులకు చెందిన జంతువులు, పక్షులకు నెలవు. కరోనా కారణంగా మూతపడిన జూపార్క్​ ఇటీవల తిరిగి ప్రారంభమైంది.

అయితే ఈ జూలో ఉన్న రెండు అరుదైన స్క్వీరెల్​ జాతికి చెందిన కోతులు అపహరణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఇనుప కంచెకు రంద్రం చేసి కోతులను ఎత్తుకెళ్లినట్లు నిర్ధరించారు. ఈ ఘటనపై స్థానిక ఒట్టేరీ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు జూ అధికారులు.

ఈ రెండు మగ స్క్వీరెల్​ కోతులను 2018లో చెన్నై విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన స్మగ్లర్​ల నుంచి వీటిని స్వాధీనం చేసుకుని జూపార్క్​కు తరలించారు.

ఈ అరుదైన కోతులకు ప్రపంచ మార్కెట్​లో భారీ డిమాండ్​ ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చూడండి: సూర్య 'గ్యాంగ్​' సీన్ రిపీట్- నకిలీ ఐటీ అధికారుల ముఠా అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.