ETV Bharat / bharat

ఇద్దరు లష్కర్​-ఏ-తోయిబా అనుచరులు అరెస్ట్ - లష్కర్​ ఏ తోయిబా ఉగ్ర అనుచరులు అరెస్ట్​

జమ్ముకశ్మీర్​ బందిపొరా జిల్లాలో లష్కర్​-ఏ-తోయిబా(ఎల్​ఈటీ) ముఠా కోసం పనిచేసే ఇద్దరు అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి గ్రెనేడ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Two militant associates of LeT arrested in J&K
ఇద్దరు లష్కర్​-ఏ-తోయిబా ఉగ్ర అనుచరులు అరెస్ట్
author img

By

Published : Feb 20, 2021, 1:56 PM IST

లష్కర్​-ఏ-తోయిబా(ఎల్​ఈటీ) ముఠా కోసం పనిచేసే ఇద్దరు అనుచరులను కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారం ప్రకారం పపచాన్​-బందిపొరా బ్రిడ్జ్​ చెక్​ పాయింట్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా.. వారు పట్టుబడ్డారు.

శుక్రవారం శ్రీనగర్​లో జరిగిన కాల్పులకు, వీరికి సంబంధం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. బందిపొరా జిల్లాకు చెందిన అబిద్​ వాజా, బషీర్ అహ్మద్ గోజెర్​​గా గుర్తించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటం, వారికి కావాల్సిన సామగ్రిని సమకూర్చటం.. వీరి వృత్తి అని పోలీసులు వివరించారు. వాళ్లు బందిపొరాలోని భద్రతా సిబ్బందిపై గ్రెనేడ్​ దాడికి పాల్పడేందుకు యత్నించినట్లు ఓ పోలీస్​ అధికారి తెలిపారు. వారి వద్ద రెండు లైవ్​ గ్రెనేడ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఇదీ చదవండి : భారత్- ‌చైనా మధ్య 10వ విడత చర్చలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.