కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్ర అనుచరలను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇరువురూ నిషేధిత ఉగ్ర సంస్థకు చెందిన హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. వారి నుంచి రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వీరిలో ఒకరు నంబ్లా ఉరీ నివాసి లియాఖత్ అహ్మద్ కాగా, మరొకరు బార్మ్నేట్ బొనియర్కు చెందిన అఖ్తర్ అహ్మద్ మిర్ అని వివరించారు.
ఈ ఇద్దరూ స్మగ్లింగ్, ఆయుధాలు, ఇతర మందుగుండు సామగ్రిని ఉగ్రవాదులకు ఏర్పాటు చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: నక్సలైట్ల దుశ్చర్య- ట్రాక్టర్లు, ట్యాంకర్లు దగ్ధం
కుల్గాంలో రెండు ఉగ్రస్థావరాలు ధ్వంసం
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాంలో రెండు ఉగ్రవాద రహస్య స్థావరాలను ఛేదించాయి భద్రతా బలగాలు. వాటిని ధ్వంసం చేసి అక్కడున్న భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం తెలిపారు. వాటిలో 7.62 ఎంఎం పీకే మెషీన్ గన్, యూఎంజీ, 7.67 ఎంఎం పీకే మెషీన్ గన్లు-9, 9ఎంఎం(స్టార్) పిస్టల్, మ్యాగజైన్, 9ఎంఎం పిస్టల్(విడిగా), 9ఎంఎం పిస్టల్స్ ఆర్డీఎస్-24, రొటేటింగ్ బోల్ట్(ఏకే-47), ఏకే-47 రౌండ్స్, ఓ చిల్లీ గ్రెనేడ్, 5.56ఎంఎం ఆర్డీఎస్‌లు-32, ఒక ఏకే-47 మ్యాగజైన్ ఉన్నట్టు పేర్కొన్నారు.
అంతేకాకుండా.. 4-సోలార్ ప్లేట్లు, 40 ఏకే-ఫైర్డ్ కేసులు, 2-కంబాట్ పౌచ్‌లు, 2-స్లీపింగ్ బ్యాగులు, బుర్ఖా(వెయిల్), 2-ఆర్మీకి సంబంధించిన చొక్కాలు సహా.. ఇతర వస్తువులూ ఉన్నట్టు చెప్పారు.
ఈ పూర్తి వ్యవహారంపై దర్యాప్తు సాగిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: చిన్నారుల సరికొత్త నేస్తం 'ఈటీవీ బాలభారత్'- రేపే ప్రారంభం