పాకిస్థాన్ సైన్యం దురాగతాలు కొనసాగిస్తూనే ఉంది. రాజౌరీ జిల్లాలోని సుందర్బనీ సెక్టార్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి కాల్పులకు తెగబడి.. మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భారత సైనికులు అమరులయ్యారని రక్షణ శాఖ తెలిపింది.

పాక్ సైన్యం కాల్పులను భారత సైన్యం దీటుగా ఎదుర్కొందని రక్షణ శాఖ స్పష్టంచేసింది.
ఇదీ చదవండి: కాలిపోతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన భర్త!