ETV Bharat / bharat

ఇండియా మ్యాప్​తో మరోసారి ట్విట్టర్​ ఆటలు! - ట్విట్టర్ గ్రీవెన్స్ అధికారి

సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్ మరోసారి తన వెబ్‌సైట్‌లో భారత దేశం పటాన్ని వక్రీకరించి ప్రదర్శించింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్​ను భారత్​లో అంతర్భాగంగా కాకుండా విడదీసి చూపింది.

Twitter depicts distorted India map on its website, shows J-K, Ladakh as separate
ట్విట్టర్​
author img

By

Published : Jul 4, 2021, 1:22 PM IST

Updated : Jul 4, 2021, 2:19 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్​ మరోసారి భారత దేశ మ్యాప్​ను వక్రీకరించింది. భారత్​లో అంతర్భాగమైన జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ను విడదీసి చూపించింది​. 'ట్వీప్ లైఫ్' అనే శీర్షికతో ట్విట్టర్​ వెబ్‌సైట్ కెరీర్ విభాగం కింద ఈ మ్యాప్ దర్శనమిచ్చింది. దీనిపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రోజురోజుకు ట్విట్టర్​ అరాచకాలు పెరిగిపోతున్నాయని ఓ యూజర్ మండిపడగా.. భారతీయులను అవమానించే రీతిలో ప్రవర్తిస్తోందంటూ మరో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్​ను నిషేధించాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

వరుస చర్యలు..

భారత మ్యాప్​పైనే గాక.. గత కొన్నిరోజులుగా.. నూతన ఐటీ చట్టాల విషయంలో భారత ప్రభుత్వంతో విభేదిస్తూ వరుస కవ్వింపు చర్యలకు దిగుతోంది ట్విట్టర్. తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్‌ నియామకం, తొలగింపు.. అంతలోనే అమెరికా పౌరుణ్ని(జెరెమీ కెసెల్) భారత్​లో ఆ పదవికి ఎంపిక చేయడం వంటివాటిని ప్రభుత్వం ఏ విధంగా పరిగణిస్తుందో వేచిచూడాలి.

కొత్త కాదు...

భారత మ్యాప్​ను తప్పుగా చూపటం ట్విట్టర్​కు ఇదే మొదటిసారి కాదు. 2020లోనూ లేహ్​ ప్రాంతాన్ని చైనా మ్యాప్​లో చూపించి విమర్శలు మూటగట్టుకుంది. ఆ సమయంలో ట్విట్టర్​ సీఈఓ జాక్ డోర్సీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం.

ఇవీ చదవండి:

Last Updated : Jul 4, 2021, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.