ETV Bharat / bharat

'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు' - undefined

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ బంగాల్​ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్న నిర్ణయాన్ని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తప్పుపట్టారు. మమతా బెనర్జీని ప్రజలు తిరస్కరించినప్పటికీ పదవి చేపడితే నైతిక విలువలపై అనేక ప్రశ్నలు తలెత్తుతాయన్నారు.

Tripura CM
'ఓడిపోయినప్పటికీ సీఎం పదవి ఎలా చేపడతారు'
author img

By

Published : May 5, 2021, 9:47 AM IST

బంగాల్​ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న మమతా బెనర్జీ నిర్ణయాన్ని భాజపా నేత, త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్ దేబ్ తప్పుపట్టారు. ఆమె పోటీ చేసిన స్థానంలో ఓడిపోయినప్పటికీ పదవి చేపట్టాలనుకోవడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమేనని అభిప్రాయపడ్డారు.

"ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. కానీ మమతా బెనర్జీ గెలవలేదు. ఆమెను ప్రజలు తిరస్కరించారు. ఆమె అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు నా విషయంలో ఇలాగే జరిగితే.. రాష్ట్రాన్ని నడిపించేందుకు ప్రజలు నన్ను ఎన్నుకోలేదని పార్టీ హైకమాండ్​కి చెప్పాను. అయితే సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు టీఎంసీ స్వేచ్ఛ కలిగి ఉంది."

-బిప్లబ్​ కుమార్ దేవ్, త్రిపుర ముఖ్యమంత్రి.

ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా ఓట్ల వాటా గణనీయంగా పెరిగిందని బిప్లబ్ అభిప్రాయపడ్డారు. బంగాల్​లో పార్టీ బలంగా పుంజుకుందన్నారు.

"మమతా బెనర్జీని ఓడించేందుకు కుట్ర జరిగిందని చెబుతున్నారు. ఓటమి ఒక కుట్రే అయితే.. ఎన్నికల్లో టీఎంసీ విజయం వెనుక కూడా అతిపెద్ద కుట్ర దాగి ఉంది"

-బిప్లబ్​ కుమార్ దేవ్

'హింసను ఆపండి..'

బంగాల్‌లో ఎన్నికల అనంతరం జరిగిన హింసను బిప్లబ్ ఖండించారు. ఈ హింసాకాండలో కనీసం ఐదుగురు భాజపా కార్యకర్తలు హత్యకు గురయ్యారని తెలిపారు. హింసకు దూరంగా ఉండేలా.. శాంతిభద్రతలను పునరుద్ధరించేలా మద్దతుదారులకు సూచించాలని మమతా బెనర్జీని కోరారు. భాజపా పాలిత రాష్ట్రం అసోంలో రాజకీయ హింసకు సంబంధించి ఒక్క ఘటన కూడా జరగలేదని తెలిపారు.

ఇవీ చదవండి: బంగాల్ సీఎంగా దీదీ ప్రమాణం నేడే

శాసనసభాపక్షనేతగా స్టాలిన్- 7న సీఎంగా ప్రమాణం

మే 18 తర్వాతే సీఎంగా ప్రమాణస్వీకారం

'ప్రతిపక్షాల ఐక్యతకు పవార్​ కృషి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.