ETV Bharat / bharat

CDS Chopper Crash: మరో రెండు వారాల్లో ట్రై సర్వీస్​ విచారణ పూర్తి! - హెలికాప్టర్​ ప్రమాదం దర్యాప్తు

CDS Chopper Crash: తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఉన్న కారణాలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ట్రై సర్వీస్​ విచారణ మరో రెండు వారాల్లోగా ముగుస్తుందని ఉన్నతాధికారులు చెప్పారు. ఇప్పటికే దర్యాప్తు బృందం సాక్షుల నుంచి వాగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

CDS Chopper Crash
ఛాపర్​ క్రాష్
author img

By

Published : Dec 17, 2021, 7:25 AM IST

CDS Chopper Crash: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ట్రై సర్వీస్​ విచారణ మరో రెండు వారాల్లో పూర్తికానుంది. భారత వైమానిక దళంలో దేశంలోనే అత్యుత్తమ ఛాపర్ పైలట్ అయిన ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్​లతో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన ఒక్కొక్క బ్రిగేడియర్​ ర్యాంక్​ అధికారుల నేతృత్వంలో విచారణ పూర్తి కానుంది.

"తమిళనాడు నీలగిరిలో ఛాపర్ క్రాష్ జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న వ్యక్తులను, కొందరు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను విచారణ కమిటీ నమోదు చేస్తుంది. అనంతరం రెండు వారాల్లో తన దర్యాప్తు పూర్తి చేస్తుందని భావిస్తున్నాం."

- అధికారులు

ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే విచారణ బృందాలు తమ పని ప్రారంభించాయి. ఇందుకు సంబంధించిన వాంగ్మూలాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో ఎయిర్ మార్షల్​తో పాటు విచారణలో ఉన్న ఇద్దరు అధికారులు దక్షిణ ఆర్మీ కమాండ్‌కు చెందిన వారు. వీరిరువురు ఛాపర్​ సంబంధిత విషయాల్లో నిపుణులని అధికారులు తెలిపారు.

తమిళనాడులోని కోయంబత్తూర్​-కూనూర్​ మధ్యలో హెలికాప్టర్​ ప్రమాదానికి గురై భారత త్రిదళాధిపతి(సీడీఎస్​) జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్​ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొత్తం 14 మంది చనిపోయినట్లు వాయుసేన ప్రకటించింది.

ఇదీ చూడండి:

రసాయన కర్మాగారంలో భారీ పేలుడు- ఐదుగురు కార్మికులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.