Train Accident: పండగ వేళ బంగాల్లోని దొమోహనీ వద్ద ఘోర రైలు ప్రమాదం జరగ్గా ముగ్గురు ఐదుగురు కోల్పోయారు. బికనేర్ నుంచి గువాహటికు ప్రయాణిస్తున్న రైలు పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పగా.. వీటిలో ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రైలు నుంచి దిగి దూరంగా పరుగులు తీశారు.
గురువారం సాయంత్రం సుమారు 5.20 గంటలకు జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, 45 మందికిపైగా గాయపడ్డట్లు అధికారులు పేర్కొన్నారు.
ఈ ఘటనకు గల కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో రైలు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు.
30 అంబులెన్సలతో..
ఘటనపై సమాచారం అందుకున్న సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 30 అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నారు.
ప్రధాని సంతాపం
రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నానని పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన రైల్వే శాఖ మంత్రి . "సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాను. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించాను. సహాయక చర్యల గురించి వివరించాను." అని ట్వీట్ చేశారు.
నష్టపరిహారం
మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల నష్ట పరిహారాన్ని అందించనున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్ప గాయాలతో బయటపడిన వారికి రూ. 25,000 చొప్పున సహాయం అందిస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : క్షుద్రపూజలు చేస్తోందని.. బతికుండగానే మహిళకు నిప్పంటించి..