Young Man Died While Dancing at Ganesh Mandapam: మనుషుల ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు. ప్రాణాలు ఎప్పుడు.. ఎలా పోతాయో చెప్పలేం. అయితే.. ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే గుండె ఆగి ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. రాత్రి పడుకున్నవారు పొద్దున్నే లేస్తారా..? లేదా? అనే అనుమానం కలుగుతోంది. మరణాలు అంతలా సంభవిస్తున్నాయి మరి!
Ganesh Celebrations: దేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. చాలా మండపాల దగ్గర రాత్రి సమయంలో ఆటలు, డ్యాన్సులు, ముగ్గుల పోటీలు, ఇంకా ఇతర పోగ్రామ్లు నిర్వహిస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన విధంగా డ్యాన్సులు చేయడం, ఆటలు ఆడటం లాంటివి చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇద్దరు మిత్రులు హుషారుగా డ్యాన్స్ చేయడం మొదలు పెట్టారు. అందులో ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఏం జరిగిందో అని కంగారుపడి.. స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కళ్లు తిరిగి పడిపోయాడని అనుకున్న వారంతా.. డాక్టర్లు చెప్పిన వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Ganesh Idol Blessings To Devotees : లేచి నిలబడి భక్తులను ఆశీర్వదిస్తున్న వినాయకుడు!.. ఎక్కడో తెలుసా?
Young Man Died in Satyasai District: ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మారుతి నగర్‌లో రాత్రి వినాయకుని మండపం ముందు ప్రసాద్ అనే యువకుడు తన స్నేహితుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. చుట్టు పక్కల ఉన్న జనాలు ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంతలో ప్రసాద్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అలా ప్రసాద్ పడిపోవడంతో అక్కడి వారు విస్తుపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆ యువకుడి ఆస్పత్రికి తరలించారు.
-
#AndhraPradesh pradesh Sri Sathya Sai District: Another #Tragedy in Dharmavaram town.
— Sunil Veer (@sunilveer08) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Prasad (26), a young man, #DiedSuddenly after #collapsing while #Dancing in front of Vinayaka Mandapam(Pandal) in Maruti Nagar, Ward 33 on Wednesday night.#collapse #DiedWhileDancing pic.twitter.com/0lzRm2VPiz
">#AndhraPradesh pradesh Sri Sathya Sai District: Another #Tragedy in Dharmavaram town.
— Sunil Veer (@sunilveer08) September 21, 2023
Prasad (26), a young man, #DiedSuddenly after #collapsing while #Dancing in front of Vinayaka Mandapam(Pandal) in Maruti Nagar, Ward 33 on Wednesday night.#collapse #DiedWhileDancing pic.twitter.com/0lzRm2VPiz#AndhraPradesh pradesh Sri Sathya Sai District: Another #Tragedy in Dharmavaram town.
— Sunil Veer (@sunilveer08) September 21, 2023
Prasad (26), a young man, #DiedSuddenly after #collapsing while #Dancing in front of Vinayaka Mandapam(Pandal) in Maruti Nagar, Ward 33 on Wednesday night.#collapse #DiedWhileDancing pic.twitter.com/0lzRm2VPiz
Gold Modak For Ganpati : గణపయ్యకు నైవేద్యంగా 'బంగారు' మోదక్.. కిలో రూ.16వేలు.. ఫుల్ డిమాండ్!
Young Man Died Due to Heart Attack Video Viral: ఆసుపత్రిలో ఆ యువకుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. అతడు గుండెపోటుతో మరణించినట్లు స్పష్టం చేశారు. అప్పటి వరకు తమ ముందు డ్యాన్స్ చేసి.. ఎంతో సందడి చేసిన ప్రసాద్.. విగత జీవిగా మారడాన్ని స్నేహితులు, స్థానికులు జీర్ణించుకోలేకపోయారు. యువకుడి మరణంతో స్థానికంగా విషాద చాయలు అలముకున్నాయి. ప్రసాద్ డ్యాన్స్ చేయడం, ఆ తర్వాత గుండెపోటుతో కిందపడిపోడం అంతా స్థానికులు వీడియో తీశారు.. అది ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Heart Attack: వాకింగ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు.. అంతలోపే..!