అసోం బోంగాయిగావ్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టాయి. అతడిని.. ఉల్ఫా ఉగ్రసంస్థకు చెందిన వెస్టర్న్ కమాండ్ నాయకుడు ద్వీపెన్ సౌద్గా అధికారులు గుర్తించారు. మరో వ్యక్తిని అరెస్టు చేశారు.
ఉగ్రవాదులు.. పక్కా ప్రణాళికతో అపహరణకు పాల్పడుతున్నట్లు సమాచారం అందుకున్న సిబ్బంది.. ఆ ప్రయత్నాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులు జరపగా.. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ద్వీపెన్ సౌద్ మరణించినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ కొనసాగుతుండగానే సౌద్ను ఆసుపత్రికి తలించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: ఒకే గదిలో వందకు పైగా కరోనా రోగులు!