ETV Bharat / bharat

ఎన్​కౌంటర్​లో లష్కరే తొయిబా టాప్​ కమాండర్​ హతం - లష్కరే తొయిబా టాప్​ కమాండర్ హతం

Abbas Sheikh killed in encounter
లష్కరే తొయిబా టాప్​ కమాండర్​ హతం
author img

By

Published : Aug 23, 2021, 7:38 PM IST

Updated : Aug 23, 2021, 8:37 PM IST

19:32 August 23

ఎన్​కౌంటర్​లో లష్కరే తొయిబా టాప్​ కమాండర్​ హతం

జమ్ము కశ్మీర్​లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. లష్కరే తొయిబా ఆధ్వర్యంలో నడిచే ది రెసిస్టెన్స్ ఫోర్స్(టీఆర్ఎఫ్)​కు చెందిన టాప్ కమాండర్లు ఇద్దరిని బలగాలు మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. మృతులు టీఆర్ఎఫ్ చీఫ్ అబ్బాస్ షేక్, అతడి సహచరుడు సాకిబ్ మం​జూర్​ అని వెల్లడించారు.

నగరంలో జరిగిన పలువురి హత్యల్లో వీరిద్దరి ప్రమేయం ఉందని అధికారులు తెలిపారు. ఉగ్రవాదంలో చేరేలా యువతను ఉసిగొల్పుతున్నారని చెప్పారు.

వీరిద్దరి ఆచూకీపై అందిన సమాచారంతో అలూచీ బాగ్​లో ఆపరేషన్ చేపట్టినట్లు కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. పది మంది జవాన్లు సాధారణ దుస్తులలో వెళ్లి వారిని చుట్టుముట్టారని, ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. ప్రతిగా బలగాలు సైతం కాల్పులు చేయగా.. ఉగ్రవాదులు ఇద్దరు మరణించారని వివరించారు. ఈ ఆపరేషన్ భద్రతా బలగాలకు దక్కిన భారీ విజయమని అన్నారు.

ఇదీ చదవండి: పుట్టినరోజు వేడుకల్లో పేలిన తుపాకీ.. చివరికి!

Last Updated : Aug 23, 2021, 8:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.