ETV Bharat / bharat

జనవరి తొలివారంలోనే 'ఎర్రకోట'పై చర్చ!

author img

By

Published : Jan 28, 2021, 2:24 PM IST

రిపబ్లిక్​ డే రోజు దిల్లీలో రైతుల ట్రాక్టర్​ ర్యాలీలో.. చారిత్రక ఎర్ర కోటపై సిక్కుల జెండా ఎగరడం.. సంచలనానికి దారి తీసింది. అయితే.. ఈ పరిణామాలు జరుగుతాయని 20 రోజుల ముందుగానే నిఘా వర్గాలు పసిగట్టాయి. అందుకే అప్పటినుంచే భద్రతా చర్యలు చేపడుతూ వచ్చామని అంటున్నాయి.

red fort incident
ఎర్రకోట ఘటనపై.. 20 రోజుల ముందే చర్చ

గణతంత్ర దినోత్సవం నాటి కిసాన్​ పరేడ్​లో ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘటనలకు భద్రతా బలగాల వైఫల్యమే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ ఉద్రిక్తతల గురించి 20 రోజుల ముందే అధికారులు పసిగట్టినట్లు తెలుస్తోంది.

సిఖ్స్​ ఫర్​ జస్టిస్​(ఎస్​ఎఫ్​జే) వంటి నిషేధిత వేర్పాటువాద సంస్థలు.. ఎర్రకోటపై ఖలిస్థానీ జెండాలు ఎగురవేయనున్నాయని అధికారులు తెలుసుకున్నారు. ఈ మేరకు జనవరి మొదటి వారంలో.. ఇంటెలిజెన్స్​​ బ్యూరో(ఐబీ) స్పెషల్ డైరెక్టర్​ ఆధ్వర్యంలో ఇతర ముఖ్య నిఘా విభాగాల అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దిల్లీకి చెందిన 8 మంది ఉన్నత స్థాయి పోలీసు అధికారులు.. 12 మంది ఐబీ అధికారులు సహా రా, ఎస్​పీజీ, హరియాణా పోలీసులు పాల్గొన్నారు. ఎర్రకోటలో గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తతలు జరిగే అంశంపై అధికారులు చర్చించారు. ఈ క్రమంలోనే.. జనవరి 20 నుంచి 27 వరకు ఎర్రకోటను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని అధికార వర్గాలు తెలిపాయి.

జెండా ఎగురవేస్తే రివార్డులు ఇస్తామని..

పంజాబ్​లోని సిక్కుల కోసం ప్రత్యేక దేశం 'ఖలిస్థాన్​' కావాలని డిమాండ్​ చేసే ఓ వేర్పాటువాద సంస్థ సిక్స్​ ఫర్​ జస్టిస్​(ఎస్​ఎఫ్​జే). 2007లో ఏర్పాటైన ఈ సంస్థ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది.

రిపబ్లిక్​ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థానీ జెండా ఎగురవేసినవారికి, ఫిబ్రవరి 1న పార్లమెంటుపై జాతీయ పతాకాన్ని తొలగించిన వారికి భారీగా నగదు బహుమతి అందిస్తామని ఎస్​ఎఫ్​జే అంతకుముందే ప్రకటించడం గమనార్హం.

రిపబ్లిక్​ డే.. వారికి బ్లాక్​ డే

వేర్పాటు వాద సిక్కులు ప్రతి ఏడాది రిపబ్లిక్​ డేను 'బ్లాక్​ డే'గా పరిగణిస్తారని అధికారులు ఈ సమావేశంలో చర్చించారు. జనవరి 26న రైతుల ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడే ప్రమాదం ఉందని కూడా వారు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే భద్రతను కట్టుదిట్టం చేస్తూ వచ్చారు.

వారే మళ్లించారు..

దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులకు కూడా వేర్పాటువాద సిక్కు సంస్థలకు చెందిన కొంతమంది సహాయం చేస్తున్నారని ఇంటెలిజెన్స్​ బ్యూరో సమావేశంలో పాల్గొన్న ఓ ఉన్నతాధికారి మీడియాకు చెప్పారు. వారే.. ట్రాక్టర్​ ర్యాలీని పోలీసులు అనుమతులు ఇచ్చిన మార్గంలో కాకుండా ఎర్రకోట వైపు దారి మళ్లించారని అన్నారు.

పార్లమెంట్​ మార్చ్ వాయిదా..

దిల్లీలో ట్రాక్టర్​ర్యాలీలో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో.. ఫిబ్రవరి 1న బడ్జెట్​ సమర్పణ నాడు జరపతలపెట్టిన 'పార్లమెంటుకు పాదయాత్ర' కార్యక్రమాన్ని వాయిదా వేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఘటనలకు సంబంధించి సుమారు 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబీ నటుడు దీప్​ సింగ్​ సిద్దూ, గ్యాంగ్​స్టర్​ లిఖా సిధానా సహా 37 మంది పేర్లు ఎఫ్​ఐఆర్​లో చేర్చారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.