దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతున్నప్పటికీ కొందరు టీకా తీసుకోవాలంటే భయపడుతున్నారు. అయితే.. ఇలాంటి వారు వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ పురపాలక శాఖ వినూత్న కార్యక్రమం చేపట్టింది. టీకా వేసుకున్న వారందరికీ టమాటాలు ఇస్తోంది.
![tomatoes offered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11469192_tomato.jpg)
"ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. రైతుల నుంచి టమాటాలు సేకరించి వాటిని టీకా తీసుకున్నవారికి పంచుతున్నాం."
-- పురుషోత్తమ్ సల్లూర్, అధికారి.
![tomatoes offered](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11469192_chhattisgarh.jpg)
ఇదీ చదవండి:చిన్నారిని కాపాడిన సాహసవీరుడికి సత్కారం