ETV Bharat / bharat

Tomato Price Today : ఠారెత్తిస్తున్న టమాట.. సెంచరీ దాటిన రేటు - తెలంగాణ వార్తలు

Tomato Price Hike in Telangana : రాష్ట్రంలో టమాట ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమాంతం ధరలు పెరిగిపోవడంతో కొనేందుకు వినియోగదారులు సంకోచిస్తున్నారు. రాష్ట్రంలో టోకు మార్కెట్‌లో.. కిలో టమాట ధర రూ.72 ఉండగా.. రైతుబజార్లు, చిల్లర మార్కెట్లలో రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. జూన్ 1న ఖరీఫ్ సీజన్‌ ప్రారంభమైనా అధిక ఉష్ణోగ్రతలు, ఇటీవల పడిన వర్షాలు, తెగుళ్లు, చీడపీడల కారణంగా దిగుబడులు తగ్గగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

Tomato
Tomato
author img

By

Published : Jun 28, 2023, 11:35 AM IST

Updated : Jun 28, 2023, 11:44 AM IST

తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిస్తున్న టమాట ధర

Tomato Price Today Telangana : తెలుగు రాష్ట్రాల్లో టమాట ధరలకు రెక్కలొచ్చాయి. కూరగాయల్లో ప్రధానమైన టమాటధరఅమాంతం పెరిగిపోవడంతో సామాన్యులపై తీవ్రప్రభావం చూపుతోంది. యాసంగి ముగిసిన తర్వాత కొత్తగా వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అధికఉష్ణోగ్రతలు, వర్షాలప్రభావం, తెగుళ్లు, చీడపీడలు ఆశించడంతో పెట్టుబడులు పెరిగి.. దిగుబడులు గణనీయంగా తగ్గడంతో మార్కెట్‌లో రేట్లు పెరిగాయి. సికింద్రాబాద్ బోయినపల్లి టోకు మార్కెట్‌లో కిలో టమాట ధర రూ.72 పలికింది. హైదరాబాద్ జంట నగరాల్లో రైతుబజార్లలో బోర్డు రేటు రూ.75గా నిర్ణయించారు. రైతుబజారులో వ్యాపారులు, రైతులు కిలో టమాట ధర రూ.90 నుంచి రూ.100 చొప్పున విక్రయించడంతో కిలో కొనాలనుకున్నా.. ధరను చూసి అరకిలో, పావుకిలోకే పరిమితం అవుతున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు.

"వర్షాలు రాకముందే రేట్లు అయితే పెరిగిపోయాయి. ఇక్కడ కిలో టమాట ధర 75 రుపాయలు. బయట మార్కెట్​లో 100 రుపాయలుగా ఉంది. కొనలేక పోతున్నాం, కిలో కొనే దగ్గర పావు కిలో కొంటున్నాం." - కొనుగోలుదారుడు

Tomato Price Today AP : గత నెలలో టమాటా ధర కిలో 3 నుంచి 5 రూపాయలు పలకగా మదనపల్లి, కర్నూలు టోకుమార్కెట్‌ యార్డుల్లో గిట్టుబాటు ధరలు లేక అనేకమంది పంట పడేశారు. ఆ సమయంలో... హైదరాబాద్‌లో కిలో టమాట రూ.20 విక్రయించారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. సరఫరా లేకపోవడంతో ధరలు పెరిగిపోయాయి. టమాటనే కాదు...పచ్చిమిరపకాయ, సోయాచిక్కుడు, గింజచిక్కుడువంటి కూరగాయలు కిలో 100కి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. టమాట, బీన్స్, చిక్కుడుకాయల ధరలు పెరిగితే వాటికి బదులుగా ఇతర కూరగాయలు వినియోగిస్తే ఆర్థిక భారం పడదని పలువురు సూచిస్తున్నారు.

"టమాట ధర నెల కిందట 25 రూపాయలు ఉంది. ఎండల వల్ల పూత రాలేదు. పూత రాలేదు కాబట్టే రైతుకు దిగుమతి లేదు. వంద బాక్సులు వచ్చేది 10 బాక్సులు మాత్రమే వస్తుంది. పది బాక్సులకు ఒక్కో బాక్సు 200 రుపాయలకు పోతుంది. రూ.75 కిలో అమ్ముతున్నారు. ఎలాంటి దళారీ లేదు మోసం లేదు. ఇంకా రెండు నెలలు పరిస్థితి ఇలానే ఉంటుంది." - నరసింహా రెడ్డి, రైతు

Tomato Price Today : రాష్ట్రంలోని పలుజిల్లాలో అధికఉష్ణోత్రలు, వర్షాలతో పంటదెబ్బతింది. ఇప్పుడు మదనపల్లితోపాటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మాత్రమే టమాట మార్కెట్‌కు వస్తోంది. కొత్త పంట చేతికొస్తే ధరలు అదుపులోకి వస్తాయని మార్కెటింగ్ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు..

"రబీ సీజన్​ అయ్యి ఖరీఫ్​ సీజన్​ స్టార్ట్​ అయింది కాబట్టి కొత్త పంటలు వేస్తారు. దీంట్లో వేరియేషన్​ ఉంటుంది. అందువల్ల టమాట రేటు పెరిగింది. రంగారెడ్డి, మెదక్ రైతులకు టమాట అందుబాటులోనే ఉంది. ఇక్కడ 75 రుపాయలు ఉంది. బయట రిటైల్​లో 100 రుపాయలు ఉంది. ఇంకా నాలుగైదు రోజుల్లో ధర తగ్గిపోతుంది." - రమేష్‌, ఎస్టేట్ అధికారి, ఎర్రగడ్డ రైతుబజార్

గతేడాదితో పోల్చుకుంటే ఈసంవత్సరం టమాటసాగు తక్కువకావడంతో ధరలకు రెక్కలొచ్చాయి. మహారాష్ట్రలో టమాట సరఫరా సరిగ్గా లేకపోవడంతో పశ్చిమబెంగాల్‌, ఒడిషా నుంచి తెప్పిస్తుండటంతో ఖర్చు పెరుగుతోంది. దిల్లీ మార్కెట్‌లో రెండురోజుల్లోనే టమాట ధరలు రెండింతలు పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇవీ చదవండి:

Last Updated : Jun 28, 2023, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.