TMC councillor shot dead: బంగాల్లో అధికార టీఎంసీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తర 24 పరగణాల జిల్లా పానీహాటీ మునిపాలిటీ 8వ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనుపమ్ దత్తాను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. అతను ఆదివారం సాయంత్రం అగర్పారా పార్కును సందర్శిస్తుండగా ఈ ఘటన జరిగింది. వెంటనే బాధితుడిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
![TMC councillor shot dead at Panihati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-n24pgs-bkp03-panigatishootout_13032022204006_1303f_1647184206_738_1303newsroom_1647191965_652.jpg)
Congress councillor shot dead
కాంగ్రెస్ కౌన్సిలర్
బంగాల్ పురిలియా జిల్లాలోనూ ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఝల్దా మున్సిపాలిటీ రెండో వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ తపన్ కాందును దండగులు కాల్చి చంపారు. బాధితుని తలలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. రాంఛీలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
![congress councillor shot dead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14721767_thumbnail_3x2_jhalda_1303newsroom_1647184406_178.jpg)
ఇదీ చదవండి: దేశంలో రెండేళ్ల కనిష్ఠానికి కరోనా కేసులు.. భారీగా తగ్గిన మరణాలు