రాజస్థాన్లోని చిత్తోర్గఢ్లో తెల్లవారుజాము 3 గంటలకు గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఒకే కుంటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను దగ్గరలోని ఉదయపుర్లోని జిల్లా ఆసుపత్రికి తరలించారు.
సిలిండర్ పేలిన సమయంలో బాధితులు నిద్రలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతులను ఇంటి యజమాని పురుషోత్తం, అతని తల్లి సజ్నీభాయి, భార్య జమునాదేవిగా గుర్తించారు. పేలుడు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.