అసోం-నాగాలాండ్‌లోని శివసాగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులు అపహరణకు గురయ్యారు. 'ఉల్ఫా' ఉగ్రసంస్థ ఈ కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
![ONGC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ritul-saikia_2104newsroom_1618978029_37.jpg)
లక్వా ఓన్జీసీ ప్లాంటు వద్ద నుంచి దుండగులు.. సిబ్బందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఓఎన్జీసీ పేర్కొంది. జూనియర్ టెక్నీషియన్లు ఎమ్ ఎమ్ గొగొయి, రితుల్ సైక్యా, జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ అలకేశ్ సైక్యా కిడ్నాప్‌కు గురైనట్లు ఓన్జీసీ ప్రతినిధి స్పష్టం చేశారు.
![ONGC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/mohini-mohan-gogoi_2104newsroom_1618978029_1104.jpg)
![ONGC](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11481514_18_11481514_1618984921187.png)
ఓన్జీసీకి చెందిన వాహనంలోనే అధికారులను కిడ్నాప్ చేసిన దుండగులు.. ఆ వాహనాన్ని అసోం-నాగాలాండ్ సరిహద్దులోని నిమోనగఢ్ అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే.. కిడ్నాపర్లు నాగాలాండ్ నుంచి తప్పించుకుని ఉంటారని జిల్లా అధికారి అనుమానం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదైనట్లు తెలిపిన పోలీసు అధికారులు.. అపహరణకు గురైన వారికోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం దుండగులు ఎలాంటి డిమాండ్లు కోరలేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'ఐఎస్ఐతో సంప్రదింపులు.. ప్రతిపక్షాలకు తిరస్కారాలా?'