ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని షకీల్(లఖ్‌నవూలోని వాజిర్గంజ్), మహమ్మద్ ముస్తుక్వీం(ముజఫర్‌నగర్), మహమ్మద్ మోయిద్(లఖ్‌నవూలోని న్యూ హైదర్‌గంజ్)గా గుర్తించారు. వీరంతా అల్‌ఖైదాకు సంబంధం ఉన్న అన్సార్ ఘజ్వాతుల్ హింద్ ఉగ్ర సంస్థకు చెందినవారని తెలిపారు.
యూపీకి యాంటీ టెర్రర్ స్కాడ్ పోలీసులు ముషీరుద్దీన్, మిన్హాద్ అహ్మద్ అనే ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఆదివారమే అరెస్టు చేశారు. ప్రస్తుతం అరెస్టైన ముస్తుక్వీం.. వారిద్దరికీ సహకరిస్తున్నారని తెలిపారు. మోయిద్ పిస్తోల్ తయారు చేసి.. మిన్హాద్ ద్వారా ముస్తుక్వీంకు అందించాడని చెప్పారు. ఆయుధాలను సేకరించేందుకు మిన్హాజ్‌కు షకీల్ సహకరించాడని పోలీసులు తెలిపారు.
కాన్పుర్‌కు చెందిన ఎనిమిది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు, ముగ్గురు మహిళలు సైతం ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు తెలిపారు. అరెస్టైన వ్యక్తులు సరిహద్దు ఆవల ఉన్నవారితో సంప్రదింపులు జరుపుతున్నారని, యూపీలోని పలు నగరాల్లో దాడులు జరపడమే వీరి ఉద్దేశమని వివరించారు.
ఇదీ చదవండి: 'తోప్ టీవీ' సీఈఓ అరెస్టు- నిలిచిన సేవలు!