ETV Bharat / bharat

పుల్వామా​లో ముగ్గురు ఉగ్ర అనుచరుల అరెస్ట్ - హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రసంస్థ అనుచరులు

జమ్ముకశ్మీర్​లో ముగ్గురు ఉగ్రవాద అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారీగా ఐఈడీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు తెలిపారు.

Three militant associates arrested in Pulwama jammu and kashmir
పుల్వామా​లో ముగ్గురు ఉగ్ర అనుచరుల అరెస్ట్
author img

By

Published : Feb 17, 2021, 7:05 PM IST

జమ్ముకశ్మీర్​లోని పుల్వామాలో ముగ్గురు ఉగ్రవాద అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి కదలికలపై పక్కా సమాచారం అందుకున్న అవంతిపొరా పోలీసులు.. రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్​పీఎఫ్​తో కలిసి దాద్సరా త్రాల్, బాటాగుండ్​ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. హిజ్బుల్ ముజాహిదీన్​కు చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నారని పోలీసులు తెలిపారు. పరిసర ప్రాంతాల్లోని ముష్కరులకు ఆయుధాల సరఫరా చేస్తున్నారని చెప్పారు.

అరెస్టైన ఉగ్రవాద అనుచరులు వీరే

  • షఫత్ అహ్మద్ సోఫీ, బాటాగుండ్​
  • మజీద్ మొహమ్మద్ భట్, దాద్సరా
  • ఉమర్ రషీద్ వానీ, దాద్సరా

అదుపులోకి తీసుకున్న ముష్కరులను అదే ప్రాంతంలో విచారించారు పోలీసులు. వారిచ్చిన సమాచారం మేరకు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 8 ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఏడు యాంటీ మెకానిజం స్విచ్చులతో పాటు ఇతర ఐఈడీ పరికరాలను గుర్తించారు.

Three militant associates arrested in Pulwama jammu and kashmir
స్వాధీనం చేసుకున్న ఐఈడీ సామగ్రి

ఇదీ చదవండి: 'ఆ రైతు నాయకుడి హత్యకు అంతర్జాతీయ కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.