ETV Bharat / bharat

కరెంట్​ కోతలకు నలుగురు రోగులు మృతి.. కమిటీ వేసిన సర్కార్​! - బళ్లారి విమ్స్ ఆస్పత్రి

కరెంట్​ కోతలకు నలుగురు రోగులు బలయ్యారు. విద్యుత్ అంతరాయం కలగడం వల్లే తమ బిడ్డలు మరణించారని రోగుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఆస్పత్రి యజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అమానవీయ ఘటన కర్ణాటకలోని జరిగింది.

three icu Patient Dead
కరెంట్​ కోతలకు నలుగురు రోగులు మృతి
author img

By

Published : Sep 15, 2022, 4:39 PM IST

Updated : Sep 15, 2022, 7:49 PM IST

ఆస్పత్రిలో రోగులు మృతి

కరెంటు కోతల వల్ల ఐసీయూలో ఉన్న నలుగురు రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయవిదారక ఘటన కర్ణాటక బళ్లారిలోని విమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై విచారణ కోసం ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
నలుగురు రోగుల మరణానికి ఆస్పత్రి యజమాన్యం, సిబ్బందే కారణమని రోగుల తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ ఘటనపై విమ్స్ ఆస్పత్రి అధికారులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. 'ఐసీయూలో ఉన్న మౌలా హుస్సేన్​, చెట్టెమ్మ, చంద్రమ్మ, మనోజ్ కుమార్​ అనే రోగులు పవర్ కట్​ వల్ల మరణించలేదు. ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్లే ప్రాణాలు కోల్పోయారు. అవన్నీ సహజ మరణాలే. కరెంట్ పోయినా జనరేటర్ ద్వారా ఐసీయూ వార్డుకు కరెంట్ అందించాం. రోగుల బంధువుల వ్యాఖ్యలు నిరాధారమైనవి ' అని విమ్స్ ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.

'బళ్లారిలోని విమ్స్‌ ఆస్పత్రిలో రోగులు మరణించడం దురదృష్టకరం. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు డాక్టర్‌ స్మిత నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశాం. ' అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. ఆస్పత్రిలో రోగుల మరణంపై ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య.. అసెంబ్లీలో మాట్లాడారు.

''ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విమ్స్​ ఆస్పత్రిలో రోగులు మరణించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్​ రాజీనామా చేయాలి. ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.. అప్పుడు జనరేటర్‌ కూడా పనిచేయలేదు. అందుకే వెంటిలేటర్లు పనిచేయక ఐసీయూలో ఉన్న రోగులు మరణించారు. ఈ ఘటనకు ఆరోగ్య శాఖ మంత్రి, విమ్స్ డైరెక్టర్, అధికారులు బాధ్యత వహించాలి. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.''

--సిద్ధరామయ్య, ప్రతిపక్ష నేత

ఇవీ చదవండి: బాలుడిని ఢీకొట్టిన బస్సు.. తలకు గాయంతోనే స్కూల్​కు విద్యార్థి.. స్పృహ తప్పి..

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం.. 25 మందికిపైగా..

Last Updated : Sep 15, 2022, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.