ETV Bharat / bharat

'వారిపై రాజకీయ నిషేధమే సరి!' - బంగాల్​ నాలుగో విడత ఎన్నికల ప్రచారం

కూచ్​బెహార్​ కాల్పుల తరహా ఘటనలు.. రాష్ట్రంలో మరిన్ని జరుగుతాయని వ్యాఖ్యానించిన నేతలను రాజకీయాల నుంచి బహిష్కరించాలని అన్నారు బంగాల్​ ముఖ్యమంత్రి మమత బెనర్జీ. భాజాపాను దేశంలో లేకుండా చేయటం ఒక్కటే ఇక తాను చేయాల్సిన పనుల్లో మిగిలి ఉందని తెలిపారు.

west bengal cm
'అలాంటి వారిని రాజకీయాల నుంచి తొలగించాలి'
author img

By

Published : Apr 12, 2021, 5:51 PM IST

పరిధి దాటి మాట్లాడే ప్రధాన మంత్రిని తాను ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని బంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ విమర్శించారు. డమ్​ డమ్​లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. కూచ్​బెహార్​ తరహాలో మరిన్ని కాల్పులు జరుగుతాయని వ్యాఖ్యానిస్తున్న నేతలను రాజకీయాల నుంచి బహిష్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.

"కూచ్​బెహార్​ తరహాలో మరింత మందిపై కాల్పులు జరుగుతాయని కొందరు అంటున్నారు. ఇలాంటివి.. రాజకీయాల్లో ఏ మాత్రం మంచిది కాదు. నాలుకను అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి. ఇలాంటి నేతలను జైల్లో పెట్టాలి. రాజకీయాల్లో లేకుండా నిషేధించాలి. మాట్లాడేటప్పుడు ఈ విధంగా పరిధులు తప్పి వ్యవహరించే ప్రధాన మంత్రిని నేను ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. అందుకు నేను సిగ్గుపడుతున్నాను. బాధపడుతున్నాను. అన్ని మతాల వారికోసం నేను పని చేశాను. ఇప్పుడు భాజపాను తరిమేయటం, దేశాన్ని కాపాడటం ఒక్కటే మిగిలి ఉంది."

- మమతా బెనర్జీ, బంగాల్​ మఖ్యమంత్రి

బంగాల్​కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రావటం వల్ల హింస చెలరేగిందని మమత ఆరోపించారు. దీనిని ఎన్నికల సంఘం సుమోటోగా ఎందుకు పరిగణించి, చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం పక్షపాతం లేకుండా వ్యవహరించాలని కోరారు.

వారి కుట్రే!

అంతకుముందు రానాఘాట్​లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మమత. ప్రధాన మంత్రి సూచనలతో కేంద్ర హోం మంత్రి అమిత్​ షా.. కూచ్​బెహార్​లో కాల్పుల ఘటను కుట్ర పన్నారని ఆరోపించారు. తాను మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తానని చెప్పారు. తాము భాజపాలాగా ప్రజలను కుల, మతాల పేరుతో విభజించేవారం కాదని అన్నారు. అందరినీ మనుషుల్లానే చూస్తామని పేర్కొన్నారు.

అంతకుముందు.. బంగాల్​లో హింసకు మమతా బెనర్జీనే బాధ్యురాలని బరాసత్​లో ఏర్పాటు చేసిన భాజపా బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆరోపించారు. 'హింసకు కారణం తన గూండాలేనని దీదీకి తెలుసు. కాబట్టి వాటి గురించి ఆమె మాట్లాడరు. ప్రతిదీ ఆమె కనుసన్నల్లోనే జరుగుతోంది' అని చెప్పారు.

ఇదీ చూడండి:'గూర్ఖాలపై ఎన్​ఆర్​సీ ప్రభావం ఉండదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.