ETV Bharat / bharat

'ఆర్టికల్​ 370 రద్దు తర్వాత 31 మంది పౌరులు మృతి'

author img

By

Published : Mar 16, 2021, 10:47 PM IST

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​-370ని రద్దు చేసినప్పటి నుంచి 31 మంది పౌరులు, 39 మంది భద్రతా సిబ్బంది మరణించినట్లు లోక్​సభలో కేంద్ర మంత్రి జి.కిషన్​ రెడ్డి తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడిన పాకిస్థాన్​ చర్యలను భద్రతా బలగాలు దీటుగా తిప్పికొట్టాయని చెప్పారు.

Thirty-one civilians, 39 securitymen killed in cross-border firing in J-K since A 370 abrogated
'ఆర్టికల్​ 370 రద్దు తర్వాత 31 పౌరులు హతం'

ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జమ్ముకశ్మీర్​లో సరిహద్దు వెంబడి జరిగిన కాల్పులు, పాక్​ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలో మొత్తం 31 మంది పౌరులు, 39 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని లోక్​సభలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు.

జమ్ముకశ్మీర్‌లో నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్థాన్ దశాబ్దాల తరబడి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనలకు పాల్పడుతోందని కిషన్​ రెడ్డి తెలిపారు. ఈ చర్యలను మన భద్రతా బలగాలు సమర్థవంతంగా తిప్పికొట్టాయని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్​సభలో ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

సరిహద్దులో నివసించే ప్రజల రక్షణార్థం.. 14,460 బంకర్ల నిర్మాణాలను చేపట్టామని కిషన్​రెడ్డి తెలిపారు. వీటిలో 7,856 బంకర్లను ఇప్పటికే నిర్మించామని చెప్పారు.

ఇదీ చూడండి:పోలీసుల కాల్పుల్లో నలుగురు నక్సల్స్​ హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.