ETV Bharat / bharat

TS New Secretariat : ఎవరొచ్చారు.. ఎక్కడెక్కడికి వెళ్లారు.. ఎంత సేపున్నారు? - telangana live news

digital pass system in telangana secretariat : సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర సచివాలయానికి అంతే రీతిలో భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. 300 సీసీకెమెరాల నిఘానీడలో డిజిటల్ పాస్​లను జారీచేసే యోచనలో ఉన్నారు. విజిటర్స్ కోసం అత్యాధునికి టెక్నాలజీతో డిజిటల్ పాస్​లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సచివాలయంలోకి అడుగుపెట్టాక వేసే ప్రతి అడుగు గమనించే విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంట్రీ కావాలంటే డిజిటల్ పాస్ ఉండాల్సిందే.. సెక్రటేరియట్​కు రానున్న కొత్త విధానం
digital pass system will begin in telangana secretariat
author img

By

Published : May 17, 2023, 3:59 PM IST

Updated : May 17, 2023, 4:17 PM IST

digital pass system in telangana new secretariat : దేశం అంతా మాట్లాడుకునే రీతిలో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రానికే ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది ఈ నూతన నిర్మాణం. భాగ్యనగర వాసులు దీనిని చూడటానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. అయితే కొత్త సచివాలయానికి ఆకర్షణ ఎంత ఉందో.. పటిష్ఠ భద్రత కూడా అంతే ఉంది. సెక్రటేరియట్​లో భద్రత ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సచివాలయం లోపలికి వెళ్లే విజిటర్స్ విషయంలో ప్రత్యేక నిఘా పెడుతున్నారు.

telangana new secretariat : ప్రస్తుతం సందర్శకులు సచివాలయం లోపలికి వెళ్లే విజిటర్స్​కు మాన్యువల్​గా ఇస్తున్న పాస్​ల స్థానంలో డిజిటల్ పాస్​లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక విధానంలో క్యూఆర్ కోడ్​తో కూడిన పాస్​లను తయారు చేస్తున్నారు. అయితే ఈ పాస్​లను పొందిన వారు లోపలికి వెళ్లిన తర్వాత ఇష్టారీతిన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా వీలుండకపోవడమే ఈ పాస్​ల స్పెషాలిటీ.

అత్యాధునిక టెక్నాలజీతో : ఎలా అంటే.. మనం ఏ శాఖకు సంబంధించిన అధికారులను కలవడానికి వెళ్తున్నామో వాటికి సంబంధించిన పాస్​లను తీసుకోవాలి. ఉదాహరణకు ఐటీ శాఖ కార్యాలయానికి వెళ్లడానికి డిజిటల్ పాస్​లను పొందిన వ్యక్తి ఎంచుకున్న కార్యాలయానికి వెళ్లడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. వేరే కార్యాలయాల ద్వారా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తే డోర్స్ తెరుచుకోవు. దేనికి సంబంధించిన పాస్​లు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టెక్నాలజీని రూపొందించడంలో ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగాలు తీవ్ర కృషి చేస్తున్నాయి.

నకిలీలకు ఆస్కారం లేకుండా : ఉప్పల్​ స్టేడియంలో బార్​కోడ్​​లను ట్యాంపరింగ్ చేసి నకిలీ టికెట్లను రూపొందించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అలాంటి నకిలీలలకు ఆస్కారం లేకుండా చేసేలా టెక్నాలజీని వినియోగిస్తోంది. ఈ డిజిటల్ పాస్​ల వ్యవస్థ అందుబాటులోకి రాగానే దీని నిర్వహణ బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించే యోచన కనిపిస్తోంది. సెక్రటేరియట్ భద్రత బాధ్యతను నిర్వహించే పోలీస్​శాఖ పర్యవేక్షణలో ఈ డిజిటల్ పాస్​ల ప్రక్రియ జరుగుతుంది. సెక్రటేరియట్​కు వచ్చే సందర్శకుల కదలికలను పోలీసులు కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఈ సచివాలయం మొత్తం 300 వరకు సీసీ కెమెరాలున్నాయి. ఇదంతా కమాండ్ కంట్రోల్ రూమ్​కే అనుసంధానించి ఉంటుంది. ఇలా సెక్రటేరియట్​లోని ప్రతి అంగుళం నిఘా నీడలోనే ఉంటుంది.

ఉద్యోగులకు స్థాయిని బట్టి కలర్ పాస్​లు : డిజిటల్ పాస్​లతో ప్రవేశించే సందర్శకులు సచివాలయంలో ఎంతసేపు ఉన్నారు? ఎవరెవరిని కలిశారు అనే సమాచారం డిజిటల్​గా రికార్డు అవ్వనుంది. వచ్చిన వ్యక్తే మరోసారి వస్తే పాత రికార్డు ఆధారంగా వీళ్లు ఇంతకు ముందు వచ్చారనే సమాచారం తెలిసిపోతుంది. అలాంటి టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఇలా ఒక వ్యక్తి ఎన్ని సచివాలయాన్ని సందర్శించారు అనే విషయం నిక్షిప్తమవ్వనుంది. సెక్రటేరియట్​లో అన్ని విభాగాల్లో పనిచేసే సుమారు రెండు వేల మంది ఉద్యోగుల కోసం ప్రత్యేక పాస్​లు ఇవ్వనున్నారు. వీరి పాస్​లను డైరెక్టర్‌, హెచ్‌వోడీ, సెక్షన్‌ ఆఫీసర్‌ వివిధ ఉద్యోగాల వారీగా విభజించనున్నారు. ఉద్యోగ స్థాయిని బట్టి ఒక్కో స్థాయికి ఒక్కో రంగుతో కూడిన పాస్​లను జారీ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : May 17, 2023, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.