ETV Bharat / bharat

'ప్రాథమిక దశలోనే జోక్యం వద్దు- విచారణ చేయనివ్వండి'

author img

By

Published : Apr 14, 2021, 7:25 AM IST

పోలీసుల విచారణ కొనసాగుతున్న కేసుల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు సూచించింది. కేసు విచారణలో ఉంటుండగా అరెస్టు చేయవద్దనో, అభియోగపత్రం దాఖలయ్యే వరకు అరెస్టు జోలికి వెళ్లవద్దనో వేర్వేరు హైకోర్టులు ఇస్తున్న ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం పేర్కొంది.

supreme
సుప్రీంకోర్టు

ఒక కేసు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు దానిలో జోక్యం చేసుకునే విషయంలో హైకోర్టులు సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. కేసు విచారణ పురోగతిలో ఉన్నప్పుడు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లోని ఆరోపణల మంచిచెడ్డల జోలికి న్యాయస్థానాలు వెళ్లకూడదని స్పష్టంచేసింది. ఈ మేరకు జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాల ధర్మాసనం మంగళవారం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసు విచారణలో ఉంటుండగా అరెస్టు చేయవద్దనో, అభియోగపత్రం దాఖలయ్యే వరకు అరెస్టు జోలికి వెళ్లవద్దనో వేర్వేరు హైకోర్టులు ఇస్తున్న ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని ధర్మాసనం పేర్కొంది.

అలా చేయడం తొందరపాటే

"ఒక నేరానికి సంబంధించిన వాస్తవాలు, పూర్తి వివరాలను వెల్లడించడానికి ఎఫ్‌ఐఆర్‌ అనేది విజ్ఞాన సర్వస్వం (ఎన్‌సైక్లోపీడియా) కాదు. పోలీసులను విచారణ పూర్తి చేయనివ్వాలి. క్రిమినల్‌ కేసుల్లో న్యాయం అందజేయడంలో సత్వర దర్యాప్తును ప్రోత్సహించాలి. అందువల్లనే కేసుల ప్రాథమిక దశలో జోక్యం చేసుకునేందుకు నెమ్మదిగా వెళ్లాలి. అస్పష్టమైన వాస్తవాల ఆధారంగా ఒక ముగింపునకు రావడం తొందరపాటే అవుతుంది" అని ధర్మాసనం 64 పేజీల తీర్పులో వ్యాఖ్యానించింది.

అరుదైన కేసుల్లోనే దర్యాప్తుపై స్టే విధించవచ్చునని తెలిపింది. మధ్యంతర ఉత్తర్వులను ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే కారణాలను తెలపాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. 2019లో నమోదైన ఒక ఎఫ్‌ఐఆర్‌లో నిందితులపై నిర్బంధ చర్యలు తీసుకోవద్దంటూ బాంబే హైకోర్టు గతేడాది సెప్టెంబరులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును కొట్టివేసింది. ఎక్కువకాలం స్టే విధించి, ఆ తర్వాత ఎత్తివేసినా ఆ సమయంలో సాక్ష్యాలు దొరక్క దర్యాప్తు ఫలప్రదంగా సాగదని వివరించింది.

ఆ అధికారం ఎన్జీటీకి లేదు

చట్టాల చెల్లుబాటును పరిశీలించడానికి, వాటిని కొట్టివేయడానికి అధికారం 'జాతీయ హరిత ట్రైబ్యునల్‌' (ఎన్జీటీ)కి లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం మరో కేసులో స్పష్టంచేసింది.

ఇదీ చదవండి: 'అంబేడ్కర్​ స్ఫూర్తితో శక్తిమంతమైన భారత్'​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.