ETV Bharat / bharat

కొవిడ్​ వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం వెసులుబాటు

కొవిడ్​ టీకా డోసులకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్ర కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. రెండో డోసు ఇవ్వాల్సినవారి సంఖ్య భారీగా ఉండటంతో కేంద్రం తాను ఉచితంగా ఇచ్చే కోటాను అవసరమైతే 100% రెండో డోసు కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలకు వీలు కల్పించింది.

guidelines
'రాష్ట్రాలు 100% రెండో డోసుకు వాడుకోవచ్చు'
author img

By

Published : May 12, 2021, 7:47 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్‌ టీకా రెండో డోసు ఇవ్వాల్సినవారి సంఖ్య భారీగా ఉండటంతో కేంద్రం తాను ఉచితంగా ఇచ్చే కోటాను అవసరమైతే 100% రెండో డోసు కోసం ఉపయోగించుకోవడానికి రాష్ట్రాలకు వీలు కల్పించింది. కొవిన్‌ యాప్‌లో ప్రజలు రెండోడోసు కోసం స్లాట్‌ బుక్‌ చేసుకొనే వెసులుబాటునూ ఇచ్చింది. అయితే రెండు డోసులకూ ఒకే ఫోన్‌ నెంబర్‌ను ఉపయోగించేలా చూడాలని సూచించింది.

కొవిన్‌ యాప్‌లో నమోదు చేసుకున్నవారు ఎక్కడైనా, ఎప్పుడైనా టీకా వేయించుకోవచ్చు కాబట్టి నియంత్రణలు విధించకూడదని తెలిపింది. రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ పురోగతిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌, టెక్నాలజీ డేటా మేనేజ్‌మెంట్‌ ఎంపవర్డ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌శర్మలు మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా రాజేశ్‌ భూషణ్‌ రాష్ట్రాలకు కీలక సూచనలు చేశారు.

  • తొలిడోసు తీసుకున్న లబ్ధిదారులకు రెండోడోసు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రం సరఫరా చేసే ఉచిత టీకాల్లో 70% రెండోడోసుకు, 30% మొదటిడోసుకు ఉపయోగించుకోవాలి. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే 100% కూడా రెండోడోసు కోసం ఉపయోగించుకోవచ్చు.
  • కేంద్రం రాష్ట్రాలకు కేటాయించే టీకాల కోటా గురించి పారదర్శకంగా 15 రోజుల ముందస్తుగానే చెబుతున్నందున వాటిని అనుసరించి ప్రణాళిక రూపొందించుకోవాలి.
  • జాతీయ సగటు కంటే ఎక్కువ వృథా చేసే రాష్ట్రాలకు ఇచ్చే టీకాలను వారికి కేటాయించే కోటా నుంచి మినహాయిస్తాం.
  • మే 1 నుంచి సరళీకృత టీకా కొనుగోలు విధానాన్ని అమలు చేస్తున్నందున రాష్ట్రాలు నేరుగా టీకా సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. ఒప్పందాలు చేసుకున్న కొన్నిరాష్ట్రాల నుంచి చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ వ్యవహారం చూసేందుకు రాష్ట్రస్థాయిలో సీనియర్‌ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి వ్యాక్సిన్‌ తయారీసంస్థలతో రోజువారీ సమన్వయం చేసుకొనే బాధ్యతలు వారికి అప్పగించాలి.

ఇదీ చూడండి: 'టీకాలే ఆ వేరియంట్​ను సమర్థంగా ఎదుర్కొంటాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.