ETV Bharat / bharat

అసోం రైఫిల్స్ కాన్వాయ్​పై ఉగ్రదాడి- ఏడుగురు మృతి

Terrorists attack convoy ofAssam Rifles' Commanding Officer in Manipur, casualties feared
అసోం రైఫిల్స్ కాన్వాయ్​పై ఉగ్రదాడి
author img

By

Published : Nov 13, 2021, 2:32 PM IST

Updated : Nov 13, 2021, 7:25 PM IST

14:30 November 13

అసోం రైఫిల్స్ కాన్వాయ్​పై ఉగ్రదాడి- ఏడుగురు మృతి

Terrorists attack convoy ofAssam Rifles
అసోం రైఫిల్స్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠి కుటుంబం

అసోం రైఫిల్స్ కమాండింగ్‌ ఆఫీసర్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేశారు. మణిపుర్​లోని చురాచంద్​పుర్ జిల్లా సింఘాట్ సబ్​ డివిజన్​లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో అసోం రైఫిల్స్ కమాండింగ్ అధికారి కర్నల్ విప్లవ్ త్రిపాఠితో పాటు ఆయన భార్య, ఎనిమిదేళ్ల చిన్నారి సైతం ప్రాణాలు కోల్పోయారని రక్షణ శాఖ తన అధికార ప్రకటనలో తెలిపింది. అసోం రైఫిల్స్​కు చెందిన మరో నలుగురు సిబ్బంది సైతం చనిపోయారని పేర్కొంది. నలుగురు జవాన్లు గాయపడ్డారని వివరించింది.

దాడి సమయంలో కాన్వాయ్‌లో కమాండింగ్‌ ఆఫీసర్‌ కుటుంబసభ్యులు, తక్షణ స్పందన సిబ్బంది ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉగ్రవాదులు తొలుత ఐఈడీతో పేలుడుకు పాల్పడ్డారని ఆర్మీ అధికారులు తెలిపారు. అనంతరం కాన్వాయ్​పై కాల్పులు జరిపారని చెప్పారు. కర్నల్ విప్లవ్ త్రిపాఠి.. తన ఫార్వర్డ్ బేస్ నుంచి బెటాలియన్ హెడ్​క్వాటర్స్​కు వెళ్తున్నారని వివరించారు.

మరోవైపు, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అమరులైన సైనికుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సైనికుల త్యాగం మరువలేనిదని అన్నారు.  

రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ సైతం ఘటనను ఖండించారు. ఈ దాడికి పాల్పడినవారిని విడిచిపెట్టేది లేదని అన్నారు.

ఖండించిన సీఎం

ఈ ఘటనపై స్పందించిన మణిపుర్ సీఎం బీరెన్ సింగ్.. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పారామిలిటరీతో పాటు రాష్ట్ర భద్రతా దళాలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. 

Last Updated : Nov 13, 2021, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.