ETV Bharat / bharat

10,12 తరగతుల పరీక్షలపై సీబీఎస్​ఈ కీలక ప్రకటన

నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో(cbse news today) 10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ పరీక్షలు జరుగుతాయని సీబీఎస్​ఈ గురువారం ప్రకటించింది(cbse news today class 10). ఇందుకు సంబంధించిన డేట్​ షీట్​ను 18న విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది.

cbse news today
సీబీఎస్​ఈ
author img

By

Published : Oct 14, 2021, 8:03 PM IST

10,12 తరగతుల ఫస్ట్​ టర్మ్​ బోర్డు పరీక్షలపై సీబీఎస్​ఈ(cbse news today) కీలక ప్రకటన చేసింది. నవంబర్​- డిసెంబర్​లో ఆఫ్​లైన్​ విధానంలో పరీక్షలు జరుగుతాయని, అందుకు సంబంధించిన డేట్​ షీట్​ ఈ నెల 18న విడుదల చేయనున్నట్టు పేర్కొంది(cbse news today class 10).

90 నిమిషాల నిడివి గల పరీక్షలు.. ఆబ్జెక్టివ్​ విధానంలో ఉంటాయని సీబీఎస్​ఈ తెలిపింది. ఉదయం 11:30కి పరీక్షలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది.

కరోనా కారణంగా గతంలో.. 2021-22 విద్యాసంవత్సరానికి మార్పులు చేసింది సీబీఎస్​ఈ. విద్యాసంవత్సరాన్ని రెండుగా విభజించి.. రెండు టర్మ్​-ఎండ్​ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు తగ్గట్టుగానే సిలబస్​లోనూ మార్పులు చేసింది.

"టర్మ్​-1 పరీక్షల తర్వాత మార్కుల రూపంలో ఫలితాలు వెల్లడిస్తాం. పాస్​, కంపార్ట్​మెంట్​, రిపీట్​ కేటగిరీలో విద్యార్థులు ఉండరు. కాగా.. రెండు టర్మ్​ పరీక్షలు అయిన తర్వాతే తుది ఫలితాలు విడుదల చేస్తాము. ఫస్ట్​ టర్మ్​ పరీక్షలకు ముందే, ఇంటర్నల్​ అసెస్​మెంట్లు, ప్రాక్టికల్​ పరీక్షలు పూర్తవుతాయి. ఇందుకోసం 50శాతం మార్కులు కేటాయిస్తారు. "

--- నన్యమ్​ భరద్వాజ్​, సీబీఎస్​ఈ ఎగ్జామ్​ కంట్రోలర్​.

2022 మార్చి-ఏప్రిల్​లో రెండో టర్మ్​ పరీక్షలు జరిగే అవకాశమున్నట్టు భరద్వాజ్​ అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:- CBSE news: ఇక 10, 12 తరగతులకు కాగిత రహిత ధ్రువపత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.