ETV Bharat / bharat

కన్హయ్య హత్య వెనుక 'అంతర్జాతీయ కుట్ర'!.. ఎన్​ఐఏ ఎంట్రీ.. ఉదయ్‌పుర్‌లో హైఅలర్ట్​

టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య నేపథ్యంలో ఉదయ్‌పుర్‌లో హైఅలర్ట్​ ప్రకటించారు పోలీసులు. దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. హత్యను సీరియస్​గా తీసుకున్న కేంద్రం.. కేసును ఎన్‌ఐఏ అప్పగించింది. ఈ హత్య వెనుక అంతర్జాతీయ కుట్ర కోణంలో విచారణ చేపట్టాలని కేంద్రం హోం శాఖ ఆదేశించింది.

ఉదయ్‌పూర్‌లో హై అలర్ట్​- కన్హయ్యాలాల్ హత్య వెనక అంతర్జాతీయ కుట్ర
tensions-are-high-in-rajasthan-following-the-brutal-murder-of-kanhaiyalal-in-udaipur
author img

By

Published : Jun 29, 2022, 12:38 PM IST

Updated : Jun 29, 2022, 5:36 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉదయ్‌పుర్‌ టైలర్ కన్హయ్యాలాల్ దారుణ హత్య నేపథ్యంలో రాజస్థాన్​లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఎలాంటి హింస జరగకుండా ఉండేందుకు ఉదయ్‌పుర్‌లో హై అలర్ట్​ ప్రకటించారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. దాదాపు ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు. సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాల సేవలు నిలిపేశారు.

టైలర్ కన్హయ్య లాల్ మృతదేహానికి స్థానిక మహారాణా భూపాల్​ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఆ సమయంలో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతిధులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో భాజపా నేత గులాబ్‌చంద్ కటారియా ఎంబీ ఆస్పత్రికి చేరుకొని.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

tensions-are-high-in-rajasthan-following-the-brutal-murder-of-kanhaiyalal-in-udaipur
కన్హయ్యాలాల్ అంత్యక్రియలు

కన్హయ్యాలాల్ అంత్యక్రియలకు హాజరైన ప్రజలు

అంత్యక్రియలకు భారీగా జనం: కన్హయ్య లాల్ అంత్యక్రియలకు భారీగా ప్రజలు, ప్రజాపతినిధులు హాజరయ్యారు. మృతదేహాన్ని ప్రదర్శనగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా హత్యను ఖండిస్తూ.. బైక్​ ర్యాలీ నిర్వహించారు. దోషులను కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేశారు.

టైలర్ కన్హయ్య లాల్ దారుణ హత్య కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించినట్లు కేంద్రం హోంశాఖ తెలిపింది. ఏదైనా ఉగ్రవాద సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ కుట్ర కోణంలో విచారించాలని ఎన్‌ఐఏను ఆదేశించింది. ఈ మేరకు ట్వీట్​ చేసింది.

రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ : కన్హయ్య లాల్ హత్యను రాజస్థాన్ ప్రభుత్వం సీరియస్​గా తీసుకుంది. బుధవారం జోధ్‌పుర్​ పర్యటనను రద్దు చేసుకుని జైపుర్ బయలుదేరారు ముఖ్యమంత్రి అశోక్​ గెహ్లోత్. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసుపై అన్ని కోణాల్లో విచారణ చేస్తుందన్నారు. ఈ హత్య వెనుక విదేశీ కుట్రను తోసి పుచ్చలేమన్నారు. కచ్చితంగా అతివాద శక్తులు ప్రోద్బలం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'మహా' సంక్షోభం: గవర్నర్‌ ఆదేశాలను సవాల్​ చేస్తూ.. సుప్రీంకు శివసేన

Last Updated : Jun 29, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.