Telangana Teacher Recruitment Exams Postponed : తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్(TRT Notification) విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 5,089 టీచర్ పోస్టులకు సంబంధించి డీఎస్సీ/ టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్(TRT) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20 నుంచి 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తాజాగా ఈ పరీక్షలు(DSC Exams) వాయిదా పడ్డాయి. రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీఆర్‌టీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన వెల్లడించారు.
Telangana DSC Exams Postponed : ఇప్పటికే టీఆర్‌టీని ఆన్‌లైన్ విధానంలో నిర్వహించాలనుకున్నారు. కాగా.. సెప్టెంబరు 20 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబరు 21వ తేదీ వరకు కొనసాగనుంది. 2 నుంచి 2.5 లక్షల మంది పోటీపడతారని అంచనా వేస్తున్నారు. పరీక్షలను నవంబరులో నిర్వహించకుంటే.. మళ్లీ ఫిబ్రవరి వరకూ స్లాట్లు దొరకవని నిర్వహణ సంస్థ టీసీఎస్ అయాన్(TCS iON) అప్పట్లోనే స్పష్టం చేసినట్లు తెలిసింది. ఫిబ్రవరిలో నిర్వహిస్తే.. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచే సమయానికి ఉపాధ్యాయ నియామక ప్రక్రియ(Teacher Recruitment Process) పూర్తికాదని విద్యాశాఖ భావించింది. దీంతో గతంలో మాదిరిగా దరఖాస్తు ప్రక్రియ మొదలైన నాటి నుంచి 4 నెలల గడువు ఇవ్వకుండా వచ్చే నవంబరులోనే పరీక్షలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కారణంగా వాయిదా పడటంతో మళ్లీ ఫిబ్రవరిలోనే పరీక్షలు నిర్వహిస్తారని విశ్వసనీయ సమాచారం.
Telangana Govt Approves 5089 Teacher Posts : డీఎస్సీ ద్వారా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి
Telangana Group 2 Exam Postponed : ఇటీవల గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించిన విషయం తెలసిందే. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో.. నవంబర్ 2, 3 తేదీల్లో జరగాల్సిన పరీక్షల నిర్వహణకు సిబ్బంది కేటాయింపు కష్టమని టీఎస్పీఎస్సీకి కలెక్టర్లు స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 783 గ్రూప్-2 ఉద్యోగాల కోసం 5 లక్షల 51 వేల 901 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,600 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్ష నిర్వహణకు.. దాదాపు 25 వేల మంది పోలీసులు, 20 వేల మంది పరీక్ష సిబ్బంది కావాల్సి ఉంది. నవంబరు 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్(Telangana Election Notification) రానున్నందున గ్రూప్-2 పరీక్ష నిర్వహణ సాధ్యం కాదని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో ఉంటుందని.. అందువల్ల పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ పరీక్షను జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ప్రాథమికంగా నిర్ణయించింది.
TRT Notification Telangana 2023 : ఉపాధ్యాయ నియామక పరీక్ష నోటిఫికేషన్ విడుదల.. 20 నుంచి దరఖాస్తులు