ETV Bharat / bharat

ఎగ్జిట్ పోల్స్​ ఫలితాలు విడుదల చేసిన ఇండియా టుడే - ఏ పార్టీకి పట్టం కట్టిందంటే?

Telangana Assembly Elections Results 2023 : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్​ ముగియడంతో ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు ఓటర్ల నాడిని అంచనా వేయడంలో పలు సర్వేలు కాంగ్రెస్​ పార్టీయే పైచేయి సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి. తాజాగా ఇండియా టుడే సైతం తన సర్వేను విడుదల చేసింది. ఆ సంస్థ ఏం చెప్పిందంటే?

india today exit polls 2023
Telangana elections Results 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 8:59 PM IST

Updated : Dec 1, 2023, 9:46 PM IST

Telangana Assembly Elections Results 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల నాడిని అంచనా వేస్తున్న పలు సర్వేలు కాంగ్రెస్​ పార్టీకే మెజారిటీ స్థానాలు వస్తాయని వెల్లడించాయి. ఈ క్రమంలో తాజాగా ఇండియా టుడే సైతం తన సర్వేను ప్రకటించింది. ఈ ఎన్నికల్లో హస్తం​ పార్టీ గెలుస్తుందని వెల్లడించింది. కాంగ్రెస్​ పార్టీకి 63 నుంచి 73 సీట్లు వస్తాయని తెలిపింది. బీఆర్​ఎస్​ పార్టీ 34 నుంచి 44 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీజేపీ 4 నుంచి 8 స్థానాల్లో, ఇతరులు 5 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని ఇండియా టుడే తన సర్వేలో ప్రకటించింది. అన్ని పార్టీలకు వచ్చిన ఓటు షేరింగ్​ శాతం చూస్తే కాంగ్రెస్​ పార్టీకి 42 శాతం, బీఆర్​ఎస్​కు 36 శాతం, బీజేపీకి 14 శాతం, ఏఐఎంఐఎం పార్టీకి 3 శాతం, ఇతరులకు 5 శాతం వచ్చింది.

India Today Exit Polls 2023 : 2018 ఎన్నికల సమయంలోనూ ఇండియా టుడే ఎగ్జిట్​ పోల్స్​ ఫలితాలు చాలా వరకు నిజమయ్యాయి. ఆ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీకి 79-91 సీట్లు వస్తాయని ఇండియా టుడే అంచనా వేసింది. ఆ సంస్థ అంచనాలను నిజం చేస్తూ 88 సీట్లతో విజయబావుటా ఎగురవేసింది. ఇదే విషయాన్ని మంత్రి కేటీఆర్ సైతం నిన్న తన ప్రెస్​మీట్​లో ప్రస్తావించారు. ఈ లెక్కన ఈసారి హస్తం పార్టీ 63 - 73 సీట్లు గెలుస్తుందని ఇండియా టుడే వెల్లడించింది. మరి ఈసారి ఆ సంస్థ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం నుంచి వెలువడిన అన్ని సర్వేలూ కాంగ్రెస్​ పార్టీయే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. మరి ఓటర్ల నాడి ఎలా ఉందో తెలియాలంటే డిసెంబర్​ 3 వరకు వెయిట్ చేయాల్సిందే.

Telangana elections Results 2023
ఇండియా టుడే ఎగ్జిట్​ పోల్స్​ 2023

సీఎన్​ఎన్​​ ఐబీఎన్​ ఎగ్జిట్ పోల్స్​ 2023 : సీఎన్​ఎన్​ ఐబీఎన్​ ప్రకటించిన సర్వేలో బీఆర్​ఎస్​ పార్టీకి 35 నుంచి 40 స్థానాల వరకు గెలవచ్చని తెలిపింది. అదే విధంగా కాంగ్రెస్​ పార్టీకి 65 నుంచి 70 స్థానాల వరకు రావచ్చని వెల్లడించింది. అదే క్రమంలో బీజేపీ 7 నుంచి 10 స్థానాల్లో గెలుస్తుందని పేర్కొంది. ఎంఐఎం 6 నుంచి 7 స్థానాల్లోనూ, ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నట్లు సీఎన్​ఎన్​ ఐబీఎన్​ ఎగ్జిట్​ పోల్స్​ అంచనా వేసింది.

ఆరా ఎగ్జిట్​ పోల్స్​ 2023 : ఆరా మస్తాన్​ ప్రీ పోల్​ సర్వే ప్రకారం బీఆర్​ఎస్​ పార్టీ 41 నుంచి 49 స్థానాలకు పరిమితం అవుతుందని అంచనా వేసింది. అదే కాంగ్రెస్​ పార్టీ 58 నుంచి 67 స్థానాల్లో గెలుస్తుందని వెల్లడించింది. బీజేపీ 5 నుంచి 7 స్థానాల్లో, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావచ్చని అంచనా వేసింది. పార్టీల వారీగా చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్​ఎస్​ 39.58 శాతం, కాంగ్రెస్​ పార్టీకి 41.13 శాతం, బీజేపీ 10.47 శాతం, ఇతరులకు 8.82 శాతం ఓట్లు శాతం ఉన్నట్లు ఆరా సంస్థ అంచనా వేసింది. కామారెడ్డిలో బీజేపీ మొదటి స్థానం కాగా, కేసీఆర్​ రెండో స్థానంలో ఉండనున్నారని వెల్లడించింది.

జన్‌కీబాత్‌ ఎగ్జిట్​ పోల్స్​ సర్వే 2023 : జన్​కీబాత్​ సర్వే ప్రకారం బీఆర్​ఎస్​ 40 నుంచి 55 సీట్లు గెలవచ్చని చెబుతోంది. కాంగ్రెస్​ పార్టీ 48 నుంచి 64 స్థానాల్లో గెలవచ్చని వెల్లడించింది. అలాగే బీజేపీ 7 నుంచి 13 స్థానాల్లోనూ, మజ్లిస్​ పార్టీ 4 నుంచి 7 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.

చాణక్య స్ట్రాటజీస్​ ఎగ్జిట్​ పోల్స్​ 2023 : చాణక్య స్ట్రాటజీస్​ సర్వే అధికార బీఆర్​ఎస్​ పార్టీ 22 నుంచి 31 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. అలాగే కాంగ్రెస్​ 67 నుంచి 78 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది. బీజేపీ 6 నుంచి 9 స్థానాల్లోనూ, ఎంఐఎం 6 నుంచి 7 చోట్ల గెలిచే అవకాశం ఉందని అంచనా.

పీపుల్స్​ పల్స్​ ఎగ్జిట్ పోల్స్​ 2023 : పీపుల్స్​ పల్స్​ సర్వే కాంగ్రెస్​ పార్టీనే స్పష్టమైన ఆధిక్యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్​ పార్టీకు 62 నుంచి 72 స్థానాలు రావచ్చని వెల్లడించింది. బీఆర్​ఎస్​కు 35 నుంచి 46 సీట్లు వస్తాయని, మజ్లిస్​ పార్టీకి 6 నుంచి 7 స్థానాలు, బీజేపీకు 3 నుంచి 8 స్థానాలు, ఇతరులకు 1 నుంచి 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. సౌత్​ ఫస్ట్​ సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.

Telangana Assembly Elections Results 2023
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్​ పోల్స్​ 2023

Last Updated : Dec 1, 2023, 9:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.