ETV Bharat / bharat

తెలంగాణ ఎన్నికల్లో ఫస్ట్​ టైమ్​ పోటీ- భారీ మెజార్టీతో విక్టరీ!- ఎవరెవరంటే? - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023

Telangana Assembly Election Results 2023 : దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన తెలంగాణ అసెంబ్లీ సమరంలో కాంగ్రెస్‌ విజయ బావుటా ఎగురవేసింది. మార్పు కావాలి- కాంగ్రెస్‌ రావాలంటూ జనంలోకి వెళ్లిన హస్తం పార్టీ అధికార పగ్గాలు చేజిక్కించుకుంది. తొలిసారి ఈ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన కొందరు అభ్యర్థులు.. సీనియర్లను ఎదుర్కొని మరీ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆ అభ్యర్థులెవరు? ఎక్కడెక్కడ నుంచి గెలుపొందారు? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం..

Assembly Election Results
Assembly Election Results
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 10:39 PM IST

Telangana Assembly Election Results 2023 : తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. ఆరు గ్యారెంటీలు, మార్పు నినాదంతో బరిలోకి దిగిన హస్తం పార్టీ(Congress).. మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధిద్దామని భావించిన గులాబీదళం ఆశలపై నీళ్లు చల్లింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి పలువురు అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగి విజయకేతనం ఎగురవేశారు. ఇది వరకు రాజకీయాలతో అంతగా సంబంధాలు లేకపోయినా తొలి ఎన్నికల్లోనే సత్తాచాటారు. తమకంటే సీనియర్లతో పోటీ పడి ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపు బావుట ఎగురవేశారు. తొలి ప్రయత్నంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆ ఎమ్మెల్యే అభ్యర్థులపై ఓ లుక్కేద్దాం.

డాక్టర్‌.. ఎమ్మెల్యేగా..
మెదక్‌ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన 26 ఏళ్ల మైనంపల్లి రోహిత్‌ విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డిపై 9వేలకుపైన మెజారిటీతో గెలుపొందారు. ఆయన మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు కుమారుడు. రోహిత్​ మేడ్చల్‌లోని మెడిసిటీ వైద్య కళాశాల నుంచి ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. రెండు గోల్డ్‌ మెడల్స్‌ సైతం సాధించారు. హైదరాబాద్‌లో వైద్యుడిగా ఉంటూనే మైనంపల్లి సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఏర్పాటు చేసి సేవలందిస్తున్నారు.

అనూహ్యంగా వచ్చి.. ఏకంగా మంత్రినే ఓడించి..
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 26 ఏళ్ల మామిడాల యశస్వినిరెడ్డి అనూహ్యంగా బరిలో నిలిచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తొలి ప్రయత్నంలోనే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆమె ఓడించారు. 2018లో బీటెక్‌ పూర్తి చేసిన యశస్వినిరెడ్డి.. వివాహం అనంతరం అమెరికాకు వెళ్లిపోయారు. అక్కడ కొంతకాలం స్థిరాస్తి వ్యాపార సంస్థలో పనిచేశారు. కాంగ్రెస్‌ పార్టీ తొలుత పాలకుర్తి అభ్యర్థిగా ఎన్నికలకు కొద్దిరోజుల ముందు విదేశాల నుంచి వచ్చిన ఈమె అత్తగారు అయిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని ప్రకటించింది. అయితే భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తు ముందుకు కదలకపోవడంతో ఆమె పోటీ నుంచి తప్పుకొన్నారు. దాంతో ఆమె కోడలు యశస్వినిరెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది.

తెలంగాణ ఎన్నికల్లో వారసుల హవా- గెలిచిందెవరు? ఓడిందెవరు?

అప్పుడు తాత.. ఇప్పుడు మనుమరాలు..
నారాయణపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచిన 30 ఏళ్ల చిట్టెం పర్ణికారెడ్డి గెలుపొందారు. బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్‌రెడ్డిపై 7,950 ఓట్ల ఆధిక్యతో ఆమె విజయం సాధించారు. పర్ణిక ప్రస్తుతం భాస్కర వైద్య కళాశాలలో పీజీ (రేడియాలజిస్ట్‌) చేస్తున్నారు. ఈమె తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్‌ ఎమ్మెల్యేగా, తండ్రి చిట్టెం వెంకటేశ్వర్‌రెడ్డి పీసీసీ సభ్యుడిగా పనిచేశారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ ఎన్నికల్లో మహిళా కోటాలో పర్ణికకు అవకాశమిచ్చింది. పర్ణిక తల్లి లక్ష్మి (ఐఏఎస్‌) పౌరసరఫరాల శాఖలో అదనపు కార్యదర్శిగా ఉన్నారు. బీజేపీ నేత, మాజీ మంత్రి డీకే అరుణ.. పర్ణికకు మేనత్త కావడం విశేషం.

తండ్రి బాటలోనే.. తనయుడు..
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయదుందుభి మోగించిన కుందూరు జయవీర్​రెడ్డికి కూడా ఈ అసెంబ్లీ ఎన్నికలు మొదటివే. ఈయన దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుమారుడు, సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల భగత్​పై 55,849 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. జయవీర్​రెడ్డి కాంగ్రెస్ కురువృద్ధుడిగా పిలుచుకునే సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు. తండ్రి బాటలోనే తనయుడు రాజకీయ ప్రవేశం చేశారు.

తండ్రి ఆశయ సాధనే.. తన గెలుపుగా..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందిత మొదటిసారి ఎన్నికల్లో పోటీచేశారు. తన తండ్రి చేసిన అభివృద్దిని గమనించి కేసీఆర్ టికెట్టు ఇచ్చారని.. ఈ ఎన్నికల్లో గెలిచి కేసీఆర్​కు తన గెలుపును గిఫ్ట్ ఇస్తానన్న ఆమె.. కాంగ్రెస్ నుంచి ఈ ఎన్నికల్లో పోటీలో దిగిన ప్రజాగాయకుడు గద్దర్ కుమార్తెపై భారీ మెజార్టీతో విజయ బావుట ఎగురవేశారు.

Telangana Women MLAs List : తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో మహారాణులు వీరే - ఎంతమంది మహిళలు గెలిచారో తెలుసా?

వీరితో పాటు ఇంకొంతమంది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసి ప్రత్యర్థులపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. వారెవరంటే..

వర్ధన్నపేట : ఈ నియోజకవర్గం నుంచి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ నుంచి మొదటిసారి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​పై ఘన విజయం సాధించారు.

మక్తల్ : ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన వారిటి శ్రీహరి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్​రెడ్డిపై మంచి మెజార్టీతో గెలుపొందారు.

జడ్చర్ల : జడ్చర్ల సిట్టింగ్ బీఆర్​ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి ఓడించారు.

కోరుట్ల : ఈ నియోజకవర్గం నుంచి బీఆర్​ఎస్​ పార్టీ తరఫున పోటీ చేసిన డాక్టర్ సంజయ్ బీజేపీ నుంచి అసెంబ్లీ బరిలో దిగిన ఎంపీ ధర్మపురి అర్వింద్​పై విజయం సాధించారు.

మహబూబాబాద్(ఎస్టీ) : ఇక్కడ తొలిసారి అసెంబ్లీ పోటీలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి మురళీనాయక్‌ ప్రస్తుత మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్​ను భారీ మెజార్టీతో ఓడించారు.

ఆర్మూర్‌ : అసెంబ్లీ బరిలోకి మొదటిసారి దిగిన బీజేపీ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి.. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జీవన్​రెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు.

Telangana Assembly Election Results 2023 : తెలంగాణలో ఎంత మంది సిట్టింగ్​ ఎమ్మెల్యేలు ఓడిపోయారో మీకు తెలుసా?

కాంగ్రెస్​ పార్టీకి జోష్​ తీసుకొచ్చి - అన్నీ తానై వన్​ మ్యాన్​ ఆర్మీ షో

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.