ETV Bharat / bharat

మాస్టార్​ ఐడియా అదుర్స్​- సైకిల్​నే 'స్మార్ట్​ స్కూల్​'గా మార్చి...

నెట్​ కనెక్షన్, మొబైల్​ సౌకర్యాలు లేక.. ఆన్​లైన్​ విద్య పొందేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థుల కోసం ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించారు. ఈ-సైకిల్​ను తయారు చేసి డిజిటల్​ స్కూల్​ను ప్రారంభించారు.

digital school, e-bycle
డిజిటల్ స్కూల్, ఈ-సైకిల్
author img

By

Published : Aug 14, 2021, 3:04 PM IST

మారుమూల ప్రాంతాల్లోని పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా ఓ ఉపాధ్యాయుడు వినూత్నంగా ఆలోచించారు. సాధారణ సైకిల్​ను ఈ-బైక్​గా మార్చి 'డిజిటల్​​ స్కూల్​' విధానాన్ని వారికి పరిచయం చేశారు. సైకిల్​కే ల్యాప్​టాప్, స్పీకర్లు అమర్చి విద్యార్థులకు చదువు అందిస్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ డిజిటల్​ విద్యా బోధన విధానాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఆయనే గుజరాత్​ కచ్​ జిల్లాకు చెందిన దీపక్​భాయ్ మోటా.

ముందు ఈ-సైకిల్ చేసి..

e- bicycle
ఎలక్ట్రిక్ సైకిల్​పై వెళ్తున్న దీపక్

సాధారణ సైకిల్​ను ఈ-సైకిల్​గా మార్చి.. దానికి సోలార్​ విధానం ద్వారా ఛార్జింగ్​ అయ్యే ఏర్పాట్లు చేశారు మాండవీలోని హుండ్రాయ్ బాగ్​ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దీపక్. సాధారణ విద్యుత్ వ్యవస్థ​ సాయంతోనూ ఛార్జింగ్​ పెట్టుకునేలా సైకిల్ తయారు చేశారు. హార్న్, సైడ్ సిగ్నల్, బ్యాటరీ ఇండికేటర్, హెడ్​ లైట్, యూఎస్​బీ ఛార్జింగ్ పాయింట్, స్పీడో మీటర్​ను సైకిల్​కు అమర్చారు. ల్యాప్ టాప్​ కూడా అమర్చే సౌలభ్యమున్న ఈ సైకిల్​ కోసం రూ. 18,000- రూ.19,000 వరకు ఖర్చు చేసినట్లు చెప్పారు.

ఇంటికే స్కూల్...

ఈ-సైకిల్​ అభివృద్ధి చేశాక డిజిటల్​ స్కూల్​పై ఆలోచన చేశారు దీపక్. నెట్​ కనెక్షన్, మొబైల్​ సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో.. పాఠశాలనే విద్యార్థుల దగ్గరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీపక్​ ప్రారంభించిన డిజిటల్​ స్కూల్​ విధానాన్ని ప్రశంసలతో ముంచెత్తింది ఆ జిల్లా విద్యా శాఖ.

e- bicycle
వెరైటీ డిజిటల్​ స్కూల్​

"కొవిడ్​ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఆన్​లైన్ విద్యా విధానం అమలు చేసింది. కానీ, మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సదుపాయం కూడా సరిగ్గా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు చదువుకోవడం ఓ సవాల్​గా మారింది. అందుకే విద్యార్థుల ఇంటి వద్దకే వెళ్లి పాఠాలు చెప్పేలా ఈ డిజిటల్​ స్కూల్​ను ప్రారంభించా."

--దీపక్​ మోటా, ఉపాధ్యాయుడు.

ఈ బోధనా విధానం తమకు బాగా నచ్చిందని హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు. ఈ పద్ధతిలో పాఠాలు వినడం కొత్తగా అనిపిస్తుందని చెప్పారు. ఓ ఉపాధ్యాయుడు.. విద్యార్థుల కోసం ఇంత కృషి చేయడం గర్వంగా ఉందని ఓ విద్యార్థి తండ్రి చెప్పుకొచ్చాడు.

e- bicycle
ల్యాప్ టాప్​ అమర్చి పాఠాలు వినిపిస్తున్న దీపక్

ఇదీ చదవండి:దేశంలోనే తొలి డ్రోన్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఎక్కడుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.