TMC Recruitment 2023 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. టాటా మెమోరియల్లోని మెడికల్, నాన్-మెడికల్ పోస్ట్‌లకు గాను 55 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. రిక్రూట్మెంట్కు సంబంధించిన విద్యార్హత, వయోపరిమితితో పాటు ఇతర ముఖ్యమైన వివరాలను నోటిఫికేషన్లో పేర్కొంది. ఆ వివరాలు మీ కోసం..
దరఖాస్తు చేసుకోవడం ఎలా ?
TMC Recruitment 2023 Application : మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 'E' పాథాలజీ, సైంటిఫిక్ ఆఫీసర్ 'Sb' బయో మెడికల్, టెక్నీషియన్ 'A', (ఎలక్ట్రికల్), నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ I లాంటి 55 రకాల వివిధ పోస్ట్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కల్పించింది. దీనికోసం TMC.gov.in అనే అధికారిక వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు తమకు కావాల్సిన పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి.. ఆ తర్వాత అప్లికేషన్లో పేర్కొన్న ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఓపెనింగ్ డేట్..
TMC Recruitment online application : నోటిఫికేషన్లో పేర్కొన్న పోస్ట్‌లను టాటా మెమోరియల్ అధికారిక వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. మే 2 నుంచి ఈ దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కాగా అప్లై చేసుకునేందుకు మే 19న సాయంత్రం 5:30 గంటల వరకు అవకాశం కల్పించింది.
విద్యార్హత..
TMC Recruitment 2023 Eligibility : టాటా మెమోరియల్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మెడికల్ పోస్ట్‌లకు ఎంబీబీఎస్‌తో పాటు సంబంధిత పోస్ట్‌కు అవసరమైన స్పెషల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్హత అవసరం ఉంటుంది. నాన్ మెడికల్ పోస్ట్‌లకు సంబంధిత విభాగంలో కనీస విద్యార్హత ఉండాలి.
వయో పరిమితి..
TMC Recruitment 2023 Age Limit : ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి పోస్టును బట్టి 27 సంవత్సరాల నుంచి 55 ఏళ్ల మధ్య ఉంది. అంతే కాకుండా కొన్ని పోస్ట్‌లకు తగిన అనుభవం కూడా అవసరముంటుంది.
ఎంపిక ప్రక్రియ..
TMC Recruitment 2023 process : అభ్యర్థులు ఆన్‌లైన్ అప్లికేషన్లో నమోదు చేసిన విద్యార్హత వివరాలను పరిశీలించి.. వాటి ఆధారంగా టాటా మెమోరియల్ స్క్రీనింగ్ చేస్తుంది. ఆ తర్వాత పోస్టుకు తగిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్ కోసం పిలుస్తారు.
జీత భత్యాలు..
TMC Recruitment 2023 pay scale : టాటా మెమోరియల్ విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.. ఈ సంస్థలో ఉద్యోగార్హత సంపాదించుకునే అభ్యర్థులకు వారి అర్హత బట్టి లెవెల్ 2 నుంచి లెవల్ 12 వరకు పే స్కేల్‌ను అందిచనున్నట్లు పేర్కొంది.