ETV Bharat / bharat

అసోం మాజీ సీఎం గొగొయి కన్నుమూత - tarun gogoi news

అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. కరోనా నుంచి కోలుకున్న ఆయన ఇతర సమస్యలకు చికిత్స పొందుతూ కన్ను మూశారు. సుదీర్ఘ కాలం అసోం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా ప్రసిద్ధిగాంచారు గొగొయి. కాంగ్రెస్ తరఫున వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Tarun Gogoi: The longest serving CM of Assam
అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయి కన్నుముత
author img

By

Published : Nov 23, 2020, 7:46 PM IST

అసోం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత తరుణ్ గొగొయి కన్నుమూశారు. కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న ఆయన.. ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మృతి చెందారు.

84 ఏళ్ల గొగొయి ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్​ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్​ కాలేజ్​ ఆసుపత్రిలో చేరారు. గత శనివారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్​ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదు. చివరకు సోమవారం సాయంత్రం కన్నుమూసినట్లు అసోం ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.

జననం

1934 అక్టోబర్ 11న అసోం జొర్హాత్ జిల్లాలోని రంగజన్ టీ ఎస్టేట్​లో తరుణ్ గొగొయి జన్మించారు. ఆయన తండ్రి డా. కమలేశ్వర్ గొగొయి అదే ప్రాంతంలో వైద్యుడు. తల్లి ఉష. 'హియార్ సమాహార్​' కవితా సంకలనానికి ఉషా గొగొయికి పేరు లభించింది.

రంగాజన్ నిమ్న బునియాదీ విద్యాలయలో తరుణ్ గొగొయి తన విద్యాభ్యాసం ప్రారంభించారు. తర్వాత జొహ్రాత్ మదరసాలో చేరారు. బదులిపార్​ టీ ఎస్టేట్​లోని భోలాగురి హైస్కూల్​లో ఆరో తరగతి వరకు చదువుకున్నారు. జొహ్రత్ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత విద్య, జగన్నాథ్ బరూవా కళాశాల నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. గువహటి యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​బీ పట్టా అందుకున్నారు.

1972 జులై 30న డాలీ గొగొయితో తరుణ్ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం ఉన్నారు. కూతురు చంద్రిమా ఎంబీఏ పూర్తి చేయగా.. కుమారుడు గౌరవ్ ప్రస్తుతం కాలిబర్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు.

రాజకీయ జీవితం

1968లో గొగొయి రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఆ సంవత్సరంలో జొర్హత్ మున్సిపల్ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యారు. ఇందిరా గాంధీ హయాంలో ఐదో లోక్​సభ(1971) ఎన్నికల్లో విజయం సాధించారు. 1976లో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) సంయుక్త కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అనంతరం 1977, 1980లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందారు. 1985-90 మధ్య రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా పనిచేసిన సమయంలో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి దక్కించుకున్నారు. అదే సమయంలో అసోం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.

Tarun Gogoi: The longest serving CM of Assam
సోనియా గాంధీతో తరుణ్ గొగొయి
  • 1991-93 మధ్య కేంద్ర ఆహార శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.
  • 1993-95 మధ్య ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వర్తించారు.
  • 1997లో అసోం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. మార్ఘెరీటా నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
  • 1998, 1999 సంవత్సరాల్లో జరిగిన 12, 13 వ లోక్​సభ ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ హామీల కమిటీ, విదేశాంగ కమిటీ, సంప్రదింపుల కమిటీల్లో పనిచేయడం సహా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖను నిర్వహించారు.

సీఎంగా

అసోంలోని టిటాబార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2001లో పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేశారు.

ఓ కార్యక్రమంలో రిబ్బన్ కటింగ్ చేస్తూ

అయితే 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అసోంలోని 14 లోక్​సభ స్థానాల్లో కాంగ్రెస్ 3 సీట్లకే పరిమితమైంది. భాజపా ఏకంగా 7 నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగురవేసింది. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గొగొయి.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​కు నేతృత్వం వహించనని ప్రకటించారు. అయినప్పటికీ 2016 ఎన్నికల్లో ఆయననే సీఎం అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది.

ప్రధాని మోదీతో కలిసి గొగొయి

విజయాలు-వివాదాలు

2001 నుంచి 2016 వరకు వరుసగా మూడు దఫాలుగా అసోం ముఖ్యమంత్రిగా పనిచేశారు గొగొయి. ఎక్కువ కాలం అసోం సీఎంగా పనిచేసిన వ్యక్తిగా రికార్డుకెక్కారు. ఈ సమయంలో రాష్ట్రంలో తిరుగుబాటును అణచివేసేందుకు కృషిచేశారు. తన పాలన కాలంలో 85 లక్షల మంది ప్రజలకు ఉద్యోగాలు ఇచ్చినట్లు గొగొయి చెబుతుంటారు.

దేశ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మరణించిన సమయంలో అసోంలోని ఓ టీ ఎస్టేట్​లో డ్యాన్స్ చేసి వివాదంలో చిక్కుకున్నారు గొగొయి. దీనిపై తర్వాత క్షమాపణలు చెప్పారు.

2016 పద్మ అవార్డు గ్రహీతలలో నలుగురిని భాజపా సూచనల మేరకే ఎంపిక చేశారని అప్పట్లో ఆరోపించారు. దీనిపైనా వివాదం చెలరేగింది.

సుదీర్ఘ కాలం అసోం సీఎంగా గొగొయి

ఇతరత్రా..

  • తరుణ్ గొగొయికి చదవడం, తోట పని చేయడం అంటే చాలా ఇష్టం.
  • క్రికెట్, ఫుట్​బాల్, టెన్నిస్ క్రీడలపై ఆసక్తి ఎక్కువ. గోల్ఫ్ ఆడేవారు.

    కాంగ్రెస్ నేత, మూడు సార్లు ముఖ్యమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.