ETV Bharat / bharat

నాగర్​కర్నూల్​లో నరహంతకుడు - మాయమాటలు చెప్పి 11 మందిని హతం - నాగర్​కర్నూల్​లో 11 మందిని చంపిన వ్యక్తిని అరెస్ట్

Tantrik Killed 11 People in Nagarkurnool : మాయమాటలు చెప్పి డబ్బు, ఆస్తులు కాజేస్తాడు. తిరిగివ్వమని అడిగితే క్షుద్రపూజలు చేసి బంగారం, గుప్తనిధులు వెలికి తీస్తానని నమ్మిస్తాడు. తాంత్రిక పూజల పేరుతో నిర్మానుష్య ప్రాంతాలకు రప్పిస్తాడు. పాలల్లో విషపూరిత రసాయనాలు కలిపి వారితో తాగించి చంపేస్తాడు. అలా నాగర్‌కర్నూల్‌కు చెందిన ఓ వ్యక్తి 11 హత్యలు చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి అదృశ్యం కేసు తీగ లాగితే ఇప్పుడు డొంకంతా కదులుతోంది.

Police Arrested Tantrik in Nagarkurnool
Police Arrested Tantrik
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2023, 9:13 AM IST

Updated : Dec 12, 2023, 12:33 PM IST

నాగర్​కర్నూల్​లో నరహంతకుడు - మాయమాటలు చెప్పి 11 మందిని హతం

Tantrik Killed 11 People in Nagarkurnool : నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ వ్యక్తి వివిధ కేసుల్లో 11 మందిని హత్య చేశాడనే సమాచారం జిల్లాలో సంచలనం రేపుతోంది. హైదరాబాద్‌లో నివాసం ఉండే వనపర్తి జిల్లా బొల్లారం గ్రామానికి చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి కొన్ని రోజులుగా కనిపించట్లేదు. చివరిసారిగా నాగర్‌కర్నూల్‌కు వెళ్లడంతో అతని భార్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గత నెల 26న ఫిర్యాదు చేసింది. ఆమె చెప్పిన వివరాల్ని సేకరించిన పోలీసులు గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే అందినట్లు గమనించారు. ఆరాతీస్తే అన్ని కేసులకు ఓకే వ్యక్తితో సంబంధం ఉన్నట్లుగా తేలింది. దీంతో తీగ లాగితే డొంకంతా కదులుతోంది.

విశ్వసనీయ సమాచారం ప్రకారం నిందితుడు, బాధితులతో తొలుత పరిచయం పెంచుకుంటాడు. మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బు లేదా ఆస్తులు కాజేస్తాడు. తిరిగివ్వమని అడిగితే క్షుద్రపూజల ద్వారా గుప్తనిధులు వెలికితీస్తానని నమ్మబలుకుతాడు. ఈ పూజల విషయం ఎవరికీ చెప్పవద్దని ముందే హెచ్చరిస్తాడు. నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి విషపూరిత రసాయనం కలిపిన పాలు తాగించి హతమారుస్తాడు. స్థిరాస్తి వ్యాపారి హత్యలోనూ ఇదే తరహా పథకం పన్నినట్లు తెలుస్తోంది.

తల్లి తల నరికి తీసుకెళ్లిన కొడుకు- ఆస్తి కోసం దారుణం!

Man Killed 11 Members in Nagarkurnool : వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో 2020లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఘటనాస్థలిలో క్షుద్రపూజలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. తీగలపల్లికి చెందిన ఓ వ్యక్తి అనంతపూర్‌లో అతని కూతురు రాయచూరులో, ఒకరు ఎండవెట్లలో, మరొకరు వనపట్ల గేటు వద్ద అనుమానాస్పదంగా చనిపోయారు. కల్వకుర్తికి చెందిన ఓ వ్యక్తిని హత్యచేసి మన్ననూరు అడవుల్లో పారేశారు. ఇవన్నీ అదృశ్యం, అనుమానాస్పద మృతి కేసులుగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదయ్యాయి.

Nagarkurnool Police Arrested Man Killed 11 People With Black Magic : మృతులంతా ఒకే తరహా విషాన్ని తాగటం వల్ల చనిపోయినట్లు తెలుస్తోంది. బంగారు ఆభరణాల తయారీలో వాడే రసాయనాన్ని నిందితుడు పాలల్లో కలిపి ఇచ్చాడని సమాచారం. దీనివల్ల హత్య చేసిన ఆనవాళ్లు లేకుండా విషం తాగి చనిపోయినట్లు అందరూ భావిస్తారనేది నిందితుడి వ్యూహం. అలా ఒకే వ్యక్తి 11 మందిని హత్య చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అన్నీ కేసుల్లోనూ బాధిత కుటుంబ సభ్యులు సదరు నిందితుడిపై అనుమానం వ్యక్తం చేసినా పట్టించుకోలేదని సమాచారం. ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసు విషయంలో ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇవాళ జోగులాంబ గద్వాల జిల్లా ఐజీ నాగర్‌కర్నూల్‌లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తోంది.

ఫిలింనగర్​లో దారుణం- అప్పు తీర్చలేదని హతమార్చారు

స్నేహితులతో కలిసి సోదరిపై అత్యాచారం- ఆపై కిరాతకంగా హత్య- ఆ విషయంలో నిలదీసినందుకే!

Last Updated : Dec 12, 2023, 12:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.