ETV Bharat / bharat

మలేసియాలో చిక్కుకున్న యువకుడు.. భావోద్వేగంతో లేఖ - మలేసియాలో చిక్కుకున్న భారత యువకుడు

Tamil Youth Stuck In Malaysia: మలేసియాలో చిక్కుకున్న తమ కుమారుడిని స్వదేశానికి తీసుకురావాలని యువకుడి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. తనను స్వదేశానికి తీసుకురావాలంటూ.. ఈ మేరకు తల్లిదండ్రులకు రాసిన లేఖ, వీడియో రికార్డింగ్​ వైరల్​గా మారింది.

Tamil youth stuck in malaysia
మలేసియాలో చిక్కుకున్న భారత యువకుడు
author img

By

Published : Dec 29, 2021, 5:35 AM IST

Tamil Youth Stuck In Malaysia: బతుకుదెరువు కోసం తమిళనాడు నుంచి మలేసియాకు వెళ్లిన ఓ యువకుడు అనుకోకుండా డ్రగ్​ మాఫియా చేతికి చిక్కాడు. ఆ గ్యాంగ్​ నుంచి పోలీసులు యువకుడిని కాపాడగా.. తనను రక్షించి స్వదేశానికి తీసుకురావాలని తల్లిదండ్రులు వేడుకుటుంన్నారు.

ఏమైందంటే..?

తమిళనాడు శివగంగైలోని ముతుపట్టి పుత్తూర్​కు చెందిన కన్నన్, ముత్తు దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఇద్దరు కుమారులు. కుమార్తెలిద్దరికీ వివాహం జరిగింది. పెద్ద కుమారుడు శరత్​కుమార్​ కోయంబత్తూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. చిన్నోడు ఆనంద్.. ఓ గుడి నిర్మాణంలో భాగంగా గతేడాది మార్చి 8న మలేసియా వెళ్లాడు. ఆ తర్వాత మూడు నెలలపాటు తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. అప్పటినుంచి వారికి టచ్​లో లేకుండాపోయాడు. దీంతో అనుమానం వచ్చి ఆనంద్ సోదరుడు విచారణ చేపట్టగా.. ఆనంద్ ఓ డ్రగ్ మాఫియా చేతుల్లో చిక్కినట్లు తేలింది. ఆ తర్వాత ఆనంద్​ను పోలీసులు రక్షించారు.

Tamil youth stuck in malaysia
యువకుడు భావోద్వేగంతో లేఖ

లేఖలో ఏముదంటే..

ఆతర్వాత ఆనంద్.. తన తల్లిదండ్రులకు ఓ లేఖ, వీడియో రికార్డింగ్ పంపించాడు. 'నేను సజీవంగా వస్తే సంతోషపడండి. ఒకవేళ మృతదేహంగా వచ్చినా మీరు మాత్రం ఏడవద్దు.' అని లేఖలో పేర్కొన్నాడు ఆనంద్​. ఈ లేఖను చదివిన తల్లిదండ్రులు.. కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడ్ని స్వస్థలానికి తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

ఇదీ చూడండి: తల్లిపై అత్యాచారయత్నం.. మామను గొడ్డలితో నరికి చంపిన బాలికలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.